బాబు ఓట‌మి అంత ఈజీనా.. వైసీపీ న‌యా స్ట్రాట‌జీ ఇదే…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబును వైసీపీ ఏమ‌నుకుంటోంది? ఆయ‌న‌ను ఎంత త‌క్కువ‌గా అంచ‌నా వేస్తోం ది? ఇవీ… ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చిన ప్ర‌శ్న‌లు. ఎందుకంటే.. చంద్ర‌బాబును ఓడించేందుకు వైసీపీ వ్యూ హాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఆయ‌న‌ను ఎట్టిప రిస్థితిలోనూ ఓడించి తీరుతామ‌ని.. వైసీపీ నాయ‌కులు శ‌ప‌థం చేస్తున్నారు. చేశారు కూడా. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబుపై పోటీ చేసేందుకు నాయ‌కుడికోసం వైసీపీ అధిష్టానం అన్వేషిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

అయితే.. ఎవ‌రిని వెతికినా.. ఎక్క‌డ నుంచి తీసుకువ‌చ్చి పెట్టినా.. చంద్ర‌బాబు ఓడించ‌డం వైసీపీకి సాధ్య‌మేనా? అనేది మౌలిక ప్ర‌శ్న‌. ఎందుకంటే.. గ‌తంలోనూ అనేక రాజ‌కీయ పార్టీలు.. అనేక రాజ‌కీయాలు చేశాయి. వైఎస్‌-చంద్ర‌బాబు ఒక‌ప్పుడు మిత్రులు.. త‌ర్వాత‌.. శ‌తృవులు. వారి మ‌ధ్య ఉన్న శ‌తృత్వం అంతా ఇంతా కాదు. అయినా.. ఎప్పుడూ వైఎస్‌ను ఓడించాల‌ని.. చంద్ర‌బాబు.. బాబుకు చెక్ పెట్టాల‌ని.. వైఎస్ అనుకోలేదు. అస‌లు అలా భావించ‌నూ లేదు. అందుకే..చిత్తూరులో టీడీపీ ఎదిగితే.. క‌డ‌ప‌లో కాంగ్రెస్ పుంజుకుంది.

అయితే.. ఇప్పుడు జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. చంద్ర‌బాబును ఓడించి తీరాల‌నే క‌సితో ఉన్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్ వ్యూహం పారేలా క‌నిపించ‌డం లేదు. ఎందుకం టే.. గ‌త ఏడాది జ‌రిగిన‌స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. దీంతో టీడీపీపై సానుభూతి ప‌వ‌నాలు వీస్తున్నాయి. చంద్ర‌బాబు మైలేజీ త‌గ్గితే.. త‌మ‌కు ప్ర‌మాద‌మ‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు భావిస్తున్నారు. అప్ప‌ట్లో టీడీపీ స్థానికంలో ఓట‌మిపై ప్ర‌జ‌లు కూడా ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇక‌, కుప్పంలో అనేక అభివృద్ధి కార్య‌క్రమాలు చేప‌ట్టిన చంద్ర‌బాబుకు ఇప్ప‌టికీ.. అదే ఇమేజ్ ఉంది. ఆయ‌న వ‌ల్లే ఇక్క‌డ త‌మ పిల్ల‌లు విదేశాల‌కు వెళ్లి చ‌దువుకున్నార‌ని.. అనేక కుటుంబాలు చెబుతున్నా యి. అదేవిధంగా పాఠ‌శాల‌లు.. ఇత‌ర సౌక‌ర్యాల‌కు కొద‌వ‌లేదు. అందుకే.. వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చీ రావ‌డంతోనే మినీ మునిసిపాలిటీగా కుప్పాన్ని తీర్చిదిద్దారు. ఇలా ఎలా సాధ్య‌మైందంటే.. గ‌త టీడీపీ ప్ర‌భుత్వం అన్ని రూపాల్లోనూ ఇక్క‌డ అభివృద్ధి చేయ‌డం వ‌ల్లే అనేది నిపుణుల మాట‌. దీనిని బ‌ట్టి.. చంద్రబాబు ఇమేజ్ డ్యామేజీ కాద‌ని అంటున్నారు.

Share post:

Popular