జ‌గ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్‌తో… ఈ వైసీపీ ఎమ్మెల్యేల‌కు పండ‌గే పండ‌గ‌..!

ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల‌కు.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న‌ను స్వ‌యంగా క‌లు సుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. దీనినే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కోరుకుంటున్నారు. “ఇప్ప‌టికే మూడేళ్లు గ‌డిచిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు .. మా సీఎంతో నేరుగా పోయి మాట్లాడిందే లే!“ అని వైసీపీకి క‌ర‌డు గ‌ట్టిన‌.. అభిమాని.. సీమ జిల్లాల‌కుచెందిన ఎమ్మెల్యే ఒక‌రు నేరుగానే వ్యాఖ్యానించారు. ఇక‌, ఇరు గు పొరుగు పార్టీల నుంచి వ‌చ్చి.. ఎమ్మెల్యేలు అయిన వారి ఆవేద‌న అంతా ఇంతాకాదు.

త‌మ‌కు అస‌లు సీఎం ద‌ర్శ‌న‌మే కావ‌డం లేద‌ని..వారు వాపోతున్నారు. ఈ నేప‌థ్యంలో.. సీఎం జ‌గ‌న్ వారికి .. అవ‌కాశం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. త్వ‌ర‌లోనే.. ఎమ్మెల్యేల‌కు అప్పాయింట్ మెంట్ ఇవ్వ‌డంతో పాటు.. వారితో నేరుగా.. ఐదేసి నిమిషాల చొప్పున మాట్లాడి స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌ను న్నట్టు స‌మాచారం. ఇది .. ఒక‌వైపు.. ఎమ్మెల్యేల‌కు ఆనందంగానే ఉంది. ఎందుకంటే.. ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న విష‌యం సాకారం కానుంద‌ని.. తెలిసి!

Six Months in Power, Jagan Sets A Dangerous Precedent

కానీ, ఇదే స‌మ‌యంలో స‌గానికిపైగా ఎమ్మెల్యేల‌కు ఇదే పెద్ద దిగులు ప‌ట్టుకుంది. “మా నాయ‌కుడితో భేటీ అంటే.. మంచిదే. ఆయ‌న మా స‌మ‌స్య‌లు వింటాడా.. లేక‌..ఆయ‌న స‌మ‌స్య‌లు మాకు చెబుతాడా? అనేది సందేహం“ అని కృష్ణాజిల్లాకు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు వాపోయారు. అదేస‌మ‌యంలో ఇప్ప‌టికే.. వివిధ మార్గాల్లో సంపాయించుకున్న రిపోర్టులు సీఎం ద‌గ్గ‌ర ఉన్నాయి. ఎవ‌రు ఎలా ప‌నిచేస్తున్నారు. ఎవ‌రు ఎలా వెనుకేసుకున్నార‌నే లెక్క‌లు ఆయ‌న ద‌గ్గ‌ర ప‌క్కాగా ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో రేపు ఎమ్మెల్యేలు వ‌చ్చి.. త‌న ద‌గ్గ‌ర కూర్చున్న‌ప్పుడు.. ఈ రిపోర్టుల‌ను బ‌య‌ట పెడితే.. ప‌రిస్తితి ఏంటి? అనేది చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఒక‌వైపు.. ఎమ్మెల్యేలు మాత్రం.. త‌మ స‌మ‌స్య‌లు వినిపిం చుకోవ‌డం లేద‌ని.. అంటుంటే.. మ‌రోవైపు.. జ‌గ‌న్ త‌న మాట లెక్క‌లేకుండా.. చిందులు తొక్కుతున్నార ని.. స‌ర్వే రిపోర్టుల‌తో స‌హా.. వారి ముందు పెడితే.. ఏం జ‌రుగుతుంది? అనేది ప్ర‌శ్న‌. ఇక్క‌డ ఓ విష‌యం చెప్పుకోవాలి.Even After 12 Years, YSRCP Yet to Strengthen Cadre Base

 

ఇటీవ‌ల‌.. జ‌రిగిన స‌మావేశంలో ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌ను జ‌గ‌న్ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. వారేమీ.. సీఎం జ‌గ‌న్ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కాదు. పైగా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళా ఎమ్మెల్యే. మ‌రొక‌రు బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే. వీరిద్ద‌రి గ్రాఫ్ సూప‌ర్‌గా ఉంద‌ని.. జ‌గ‌న్ నేరుగానే చెప్పారు. మ‌రి దీనిని బ‌ట్టి.. ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాల్సింది.. నియోజ‌క‌వ‌ర్గాన్ని.. ప్ర‌జ‌ల‌ను వారు ప‌ట్టించుకుంటే.. అడ‌గ‌కుండానే.. జ‌గ‌న్ వారి చుట్టూ తిరుగుతార‌ని.. వారికి కోరి అప్పాయింట్‌మెంట్ ఇస్తార‌ని!! మ‌రి ఈ చిన్న విష‌యం.. తెలుసుకోక‌పోతే ఎలా? అనేది ప్ర‌శ్న‌.

Share post:

Latest