పరాయి మగాడితో రొమాన్స్..తప్పేముంది అంటూ దీపిక బిగ్ బాంబ్..!!

సినిమా అంటేనే అన్ని రంగుల కలగలిసిన జర్ని. మరి అలాంటి దానిలో రొమాన్స్ లేకుండా ఉంటాదా..? ఖచ్చితంగా ఉంటుంది. అయితే, అది హద్దుల్లో ఉంటే చాలా హెల్తీ, గౌరవం. అదే..ఆ రొమాన్స్ హద్దులు దాటితే, మితి మీరితే..మరీ వల్గర్ చూయిస్తే.. అందులోను అలాంటి సన్ని వేశాలల్లో ఓ పెళ్ళైన స్త్రీ మూర్తి నటిస్తే..మన సమాజం ఖచ్చితంగా తప్పుపడుతుంది.

అలానే చేసింది బాలీవుడ్ బ్యూటీ దిపీకా పదుకునే విషయంలో. మనకు తెలిసిందే దిపీక నటన పరంగా టూ గుడ్. ఏలాంటి రోల్ కి అయినా సెట్ అయ్యే మైండ్ సెట్ ఉండే అమ్మాయి. అయితే, పెళ్లికి ముందు ఎలా ఉన్నా..పెళ్ళి తరువాత మాత్రం కొంచెం పద్ధతిగా ఉంటే బాగుంటుందని అభిమానులు సలహా ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో స్పీడ్ ని తగ్గించుకోమని సజీషన్స్ ఇస్తున్నారు.

ఇలాంటివాటికి ఘాటు గా రిప్లై ఇచ్చింది దీపికా. రీసెంట్ గా మీడియా తో ముచ్చటించిన అమ్మడుకి “గెహ్రైయాన్ “సినిమాలో పరాయి పురుషితో పెళ్ళైయాక కూడా ఘాటు రొమాన్స్ తప్పుకాదా..అంటూ ఆమెను ప్రశ్నించగా..ఆమె షాకింగ్ రిప్లై ఇచ్చింది. “పెళ్లికి ముందా, పెళ్లి తరువాత అనే విషయం పక్కన పెడితే..ఒక నటిగా నాకు అన్ని సీన్స్ లో చేసే రైట్ ఉంది. ఇక సినిమాలో నా కధకు తగ్గట్లు నేను వెళ్ళాను. ఆ టైంలో రొమాన్స్ అవసరం..అందుకే చేశా..అందులో తప్పేముంది. నేను , నా భర్త ఇద్దరం మాట్లాడుకున్నాకనే ఈ రోల్ చేశా..నాకు, నా భర్తకు లేని ప్రాబ్లమ్ మిగతా వాళ్ళకు ఎందుకు..?..” అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. అంతేకాదు ” అమ్మాయిలు ,ఎవ్వరు ఏం చేయాలి అనుకున్నా అది చేసేయ్యండి. మీకు నచ్చిన పనిని చేయకుండా ఆపే అధికారం ఎవ్వరికి లేదు. అలా అని మితిమీరిన స్వేఛ కూడా మంచిది కాదు..”అంటూ చెప్పుకొచ్చింది. దీంతో దీపిక మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.