డైరెక్ట‌ర్ వంశీ భానుప్రియ పెళ్లికి అడ్డుప‌డింది ఎవ‌రు… ఏం జ‌రిగింది…?

సితార సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ భానుప్రియ. మొదటి సినిమాకే భానుప్రియ నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. నిజానికి భానుప్రియ తమిళ సినిమాల ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. కానీ ఆ తర్వాత ఇతర భాషల్లోనూ నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలకు జోడిగా భానుప్రియ నటించారు. అందం అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. భానుప్రియ అందం మరియు ఆమె వాయిస్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యేవారు.

భానుప్రియ తన సినీ కెరీర్ లో ఎక్కువగా హీరో సుమన్ పక్కన సినిమాలు చేశారు. సుమన్ కు జోడిగా భానుప్రియ ఏకంగా 14 సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. అంతేకాకుండా నటసింహం నందమూరి బాలయ్యకు జోడిగా భానుప్రియ 8 సినిమాల వరకు నటించారు. ఇదిలా ఉంటే భానుప్రియను వెండితెరకు దర్శకుడు వంశీ పరిచయం చేశారు. భానుప్రియ మొదటి సినిమా సీతారతో పాటు అన్వేషణ సినిమాకు కూడా వంశీ దర్శకత్వం వహించారు.

భానుప్రియను దగ్గర నుండి చూసిన డైరెక్టర్ వంశీ ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇక ఇదే విషయాన్ని వంశీ భానుప్రియ తల్లికి కూడా చెప్పారు. అయితే భానుప్రియ తల్లి మాత్రం ఈ పెళ్లికి నిరాకరించారు. దానికి కారణం అప్పటికే దర్శకుడు వంశీకి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. దాంతో తన కూతురి జీవితం గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత భానుప్రియ కొరియోగ్రాఫర్ సుమతి కౌశల్ కుమారుడు ఆదర్శ కౌశల్ తో ప్రేమలో పడ్డారు.

ఆదర్శ్ కౌశలను భానుప్రియ గాఢంగా ప్రేమించారు. కానీ వీరిద్దరి పెళ్ళికి కూడా భానుప్రియ తల్లి నిరాకరించారు. అయినప్పటికీ భానుప్రియ తల్లి మాట వినకుండా అమెరికాకు వెళ్లి ఆదర్శ్ కౌశల్ ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరికి ఓ కుమార్తె కూడా పుట్టింది. కానీ పెళ్ళైన కొంత కాలానికినే ఆదర్శ కౌశల్ గుండెపోటుతో మరణించారు. అనంతరం భానుప్రియ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తన కూతురే సర్వస్వం గా భావిస్తూ జీవితాన్ని గడుపుతున్నారు.