సినిమా పరిశ్రమలో వారసులను కోల్పోయిన సెలబ్రిటీస్ ఎంతమందున్నారో తెలుసా?

కష్టాలనేవి ఎవరిని ఎప్పుడు చుట్టుముడతాయో చెప్పలేము. వాటికి చిన్న, పెద్ద అనే తారతమ్యం అనేది ఉండదు. సాధారణ సాధారణ మనుషులనుండి సెలిబ్రిటీల వరకు ఈ విషయంలో అందరూ ఒక్కటే. ఎలాంటి తల్లిదండ్రులైనా తమ పిల్లలు పట్ల ఎంతో ప్రేమను కలిగి వుంటారు. వారిని వున్నత స్థాయిలో చూడాలని కలలు కంటూ వుంటారు. అయితే అనుకోకుండా అదే కన్న బిడ్డలు తమ కళ్ళ ముందే జీవితాన్ని ముగిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మాటలో చెప్పలేము. ఇలాంటి విషయాల్లో సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు సైతం ఒకటే దుఃఖం ఉంటుంది.

మహా నటుడు కోట శ్రీనివాసరావు అంటే తెలియని వారు ఉండనే వుండరు. ఈయన కుమారుడు రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించారు. చిన్న వయసులోనే ఎంతో భవిష్యత్తు వున్న తన కుమారుడు ఇలా మరణించడంతో కోట శ్రీనివాసరావు బాగా కృంగిపోయారు. అలాగే ఆయనతో పాటు సహనటుడుగా అనేక సినిమాల్లో చేసిన బాబు మోహన్ కొడుకు కూడా అదే విధంగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. బాబు మోహన్ కూడా అప్పుడు చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయంలో ఇద్దరికీ ఇలా జరగడం బాధాకరమే.

విలక్షణమైన నటుడు ప్రకాష్ రాజ్ చిన్న వయసులోనే కొడుకును కోల్పోయాడు. ఆ బాధను ప్రకాష్ రాజ్ ఎన్నో సంవత్సరాలు మరువలేకపోయాడు. అయితే ఈ బాధ తన రెండో పెళ్లి ద్వారా తీరింది. రెండో పెళ్లి చేసుకున్నాక ప్రకాష్ కి ఓ మగబిడ్డ జన్మించాడు. ఇక ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవా కూడా తన కొడుకుని చిన్న వయసులోనే కోల్పోయారు. పలు అనారోగ్య సమస్యల వల్ల తన కొడుకు మరణించినట్లుగా తెలుస్తోంది. చివరగా తెలుగు సినిమా కి ఒక ప్రత్యేక కీర్తి ఏర్పరిచిన ఎన్టీఆర్ ఏడుగురు కుమారులలో పెద్దవాడు రామకృష్ణ చాలా చిన్న వయసులోనే మరణించారు. అలాగే పెద్ద కొడుకు హరికృష్ణ, అతనికొడుకు జానకిరాము కూడా యాక్సిడెంట్ లో మరణించారు.