ఆర్య సినిమాని వదులుకున్న ముగ్గురు స్టార్ హీరోలు.. ఎవరంటే..?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఆర్య, ఆర్య-2 సినిమా మంచి విజయాలను అందుకున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం ఆర్య. ఈ సినిమాను అప్పట్లో యువత ఎంతగానో ఆకట్టుకుంది. గంగోత్రి సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీకి అడుగు పెట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఆర్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన అల్లు అర్జున్ ముందుగా ఈ సినిమా ముగ్గురు స్టార్ హీరోలకు వినిపించారట వారు రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా అల్లు అర్జున్ వద్దకు వెళ్ళినట్లు సమాచారం వాటి గురించి తెలుసుకుందాం.ముందుగా హీరో నితిన్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారు అట.. జయం సినిమాతో మంచి విజయాలను అందుకున్న నితిన్ అనంతరం పలు సినిమాలను నటిస్తూ బిజీగా మారిపోయారు. అయితే ఈ సినిమా తర్వాత దిల్ సినిమా చేసే సమయంలో సుకుమార్ ఈ కథను వినిపించడంతో నితిన్ ఫస్ట్ అఫ్ బాగున్నా సెకండాఫ్ నచ్చకపోవడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశారట.ఇక ఆ తరువాత సుకుమార్ ప్రభాస్ దగ్గరకు ఈ కథ తీసుకొని వెళ్లగా ప్రభాస్ అప్పటికే వర్షం సినిమా చేస్తున్నారు అయితే కథ విన్న ప్రభాస్ కథ నచ్చిందని చెప్పినప్పటికీ తన స్నేహితులు మాత్రం ఇలాంటి స్టోరీ తనకు సెట్ అవ్వదని ప్రభాస్ కు చెప్పడంతో ప్రభాస్ ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.డైరెక్టర్ సుకుమార్ ఆ తరువాత రవితేజ దగ్గరకు ఈ కథ తీసుకొని వెళ్లగా కథ మొత్తం వున్న రవితేజ ఇలాంటి కథ తనకు సెట్ అవ్వదని నితిన్ లాంటి వాళ్లకు బాగా సెట్ అవుతుందని సలహా ఇచ్చారట.. అయితే ఈ సినిమా హీరో కోసం చాలా ప్రయత్నాలు చేశారు సుకుమార్ అదే సమయంలో దిల్ సినిమా విడుదల కావడంతో పలువురు టాలీవుడ్ హీరోల కోసం ఈ షోని ఒక స్పెషల్ షో గా వేశారట. ఇక ఈ షో చూడడం కోసం అల్లు అర్జున్ రావడంతో అల్లు అర్జున్ ను చూసిన సుకుమార్ తన సినిమాకు పర్ఫెక్ట్ హీరో ఇతనే అని భావించి అల్లు అరవింద్ మెగాస్టార్ కి ఈ కథ వినిపించారట. వారిద్దరూ ఒకే చెప్పడంతో దిల్ రాజు నిర్మాణంలో ఆర్య సినిమాని తెరకెక్కించారు.

Share post:

Latest