బిగ్ షాకింగ్: ప్రభాస్-మారుతి సినిమా నుండి తప్పుకున్న బడా నిర్మాత..?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సినిమా అంటే ఇప్పుడు అందరు ఎగిరి గంతేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన రాధే శ్యామ్ ఫ్లాప్ అయినా..కానీ, ప్రభాస్ క్రేజ్, రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే బోలెడు అవకాశాలు వస్తున్నాయి. అలాంటి పాపులారిటీని సంపాదించుకున్నాడు ప్రభాస్ బాహుబలి సినిమాతో. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ..ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ఈ రెబల్ హీరో .

- Advertisement -

అయితే, ప్రభాస్ చేతిలో ఇప్పుడు ఐదు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది కాకుండా మారుతీతో ఓ సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. దీని పై అఫిషీయల్ ప్రకటన రానప్పటికి..తెర వెనుక అన్ని సెట్ చేసుకున్నారు మారుతి..రేపో మాపో దీని పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, ఇలాంటి క్రమంలోనే ఓ షాకింగ్ న్యూస్ బయటపడింది. ప్రభాస్-మారుతి సినిమాకు ఓ బడా నిర్మాత అడ్డుపడుతున్నాడు అన్న మ్యాటర్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సంచలనగా మారింది. ఆ నిర్మాత మరెవరో కాదు ప్రాజెక్ట్ కె ప్రొడ్యూసర్ అశ్విని దత్. యస్..సోషల్ మీదియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం..టాలీవుడ్ బడా ప్రోడ్యూసర్ లల్లో ఒకరైన అశ్విని దత్ మారుతి -ప్రభాస్ సినిమాకు హ్యాండ్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. తన అల్లుడు నాగ్ అశ్విన్ ని దర్శకుడిగా పెట్టి ప్రాజెక్ట్ కె మూవీపై వందల కోట్ల బడ్జెట్ ఇన్వెస్ట్ చేసి..రికార్డ్ క్రియేట్ చేశాడు. అలాంటి ఆయన ప్రభాస్ తో చిన్న బడ్జెట్ మూవీలు చేస్తే వర్క్ అవుట్ అవ్వదు అని ఫిక్స్ అయ్యి…సినిమా నుండి తప్పుకున్నాడట. కానీ ప్రభాస్ ఎలాగైనా మారుతితో సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.

Share post:

Popular