“రామారావ్ ఆన్ డ్యూటీ” సినిమా వారికి నచ్చదట.. ఎందుకంటే?

శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా “రామారావ్ ఆన్ డ్యూటీ” సినిమా ఈరోజు థియేటర్లలో సందడి చేస్తోంది. విడుదలైన సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఓ వర్గం వారు మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆశించిన విధంగా లేదని పెదవి విరిచేస్తున్నారు. అయితే ఈ సినిమా తుది ఫలితం తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటలు ఆగాల్సిందే. తొలిరోజు ఈ సినిమాకు బుకింగ్స్ పరవాలేదనిపించే విధంగా ఉండగా పాటల ప్లేస్ మెంట్ సరిగ్గా లేకపోవడం పెద్ద మైనస్ అని చెబుతున్నారు.

అయితే రవితేజ అభిమానులకు మాత్రం ఈ సినిమా మంచి విందుభోజనం అని తెలుస్తోంది. అయితే ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే సీన్లు లేకపోవడం, లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు ఈ సినిమాకు మైనస్ గా మారాయని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో చెప్పిన డైలాగ్స్ కు లిప్ సింక్ కాలేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉండటం, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు నచ్చే విధంగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.

ఇకపోతే ఈ కధపైన రవితేజకు కూడా నమ్మకం ఉండబట్టే ఈ సినిమా నిర్మాతలలో ఒకరు అయ్యారు. ఈ సినిమాకు ఆయన గట్టిగానే ప్రమోషన్స్ చేశారు. సినిమాలో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదని సమాచారం అందుతోంది. రవితేజ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక అభిమానుల ఆశ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి మరి. రవితేజ దృష్టి పెడితే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు రవితేజతో పని చేయడానికి ఆసక్తి చూపించే అవకాశం అయితే మెండుగా వుంది.