శోభన్ బాబు – జయలలిత రిలేషన్ నిజమేనా? ఇదిగో ప్రూఫ్?

సెలిబ్రిటీల మధ్య వ్యవహారాలంటే జనాలకి మంచి ఆసక్తిగా ఉంటుంది. అందులోనూ రూమర్స్ అంటే మీడియాలా వారికి మంచి TRP రేటింగ్ వస్తుంది. జనాల వీక్ నెస్ మీద కొట్టాలనుకున్న పలు మీడియాలు అసత్యమైన కథనాలను ప్రసరిస్తూ ఉంటాయి. ఇక ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని ప్రజలు వేలంవెర్రిగా న్యూస్ ఫాలో అవుతూ వుంటారు. అలనాటి అలాంటి న్యూస్ ఒకటి ఇప్పటికీ పలు మీడియాలలో, సోషల్ మీడియాల్లో చక్కెర్లు కొడుతూ ఉంటుంది. అయితే ఇపుడు దాని గురించి ఒకసారి తెలుసుకుందాం.

శోభన్ బాబు – జయలలిత మధ్య రిలేషన్ నిజామా, అబద్ధమా? అనే ప్రశ్న అందరిలో వుంది. ఇపుడు దాన్ని క్లారిటీగా తెలుసుకుందమా… అందాల నటుడు శోభన్ బాబు, తమిళుల తల్లి జయలలితకు మధ్య గల అనుబంధం ఆ రోజుల్లో హాట్ టాపిక్. ఇద్దరి మధ్య ప్రేమ నడుస్తోందని, వారి ప్రేమ బంధానికి గుర్తుగా ఒక పాప కూడా జన్మించిందని పుకార్లు షికార్లు చేసేయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు అలనాడు పలు సినీ మ్యాగజీన్లలో హల్ చల్ చేసిన సంగతి నిన్నటి తరం వారికి బాగా తెలుసు.

శోభన్ బాబు సినిమాల్లోకి వచ్చేసరికే జయలలితకు పలు సినిమా ఇండస్ట్రీలలో మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. ఈ క్రమంలో ‘డాక్టర్ బాబు’ చిత్రంలో వీరు కలిసి నటించారు. ఆ సినిమాతో వారిద్దరూ బాగా దగ్గరయ్యారు. వారి మధ్య చనువు చూసిన లోకం ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని భావించింది. అందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ ఈ నేపథ్యంలో వారిద్దరికి ఒక బిడ్డ కూడా పుట్టిందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అప్పటికే పెళ్లి కాబడిన కారణంగా శోభన్ బాబు ఆమెకి దూరమయ్యాడు. జయకు ఇష్టం లేకపోయినప్పటికీ శోభన్ నుండి బలవంతంగా దూరం కావలసి వచ్చింది. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాల్లో ఆమె ఎంజీఆర్ కు దగ్గరవడం ఆయన సాయంతో ఆమె రాజకీయాల్లో ప్రవేశించడం అందరికీ తెలిసినదే.