సమంత లేకుండానే రౌడీ బాయ్ పార్టీ చేసుకుంటున్నాడా? ఇంతకీ సామ్ ఏమైనట్టు?

విజయ్ దేవరకొండ – సమంత.. వీరిద్దరూ ఇప్పుడు మంచి ఫామ్ లో వున్నారు. సినిమాల పరంగా సామ్ విజయ్ కంటే సీనియర్ అయినప్పటికీ వయస్సు విషయంలో పెద్ద వ్యత్యాసం ఉండదు. విజయ్ కంటే సామ్ ఓ రెండేళ్లు పెద్ద ఉంటుంది. అయితే లుక్స్ పరంగా మాత్రం ఆ వయస్సు పెద్ద తెలియదు. అయితే త్వరలో వీరిద్దరూ జతకట్టబోతున్న విషయం తెలిసినదే. శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ ఒకవైపు లైగర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొంటూనే మరొకవైపు ఖుషి సినిమా షూటింగ్ కూడా ఫినిష్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో కూడా ఖుషి సినిమాను భారీ స్థాయిలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. క్యూట్ లవ్ స్టోరీ గా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించబోతున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో కొనసాగుతోంది. మొన్నటి వరకు వివిధ ప్రదేశాల్లో షూటింగ్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలోనే ఏడూ ఎకరాల్లో ప్రత్యేకమైన ఒక సెట్లో సినిమా షూటింగ్ కొనసాగిస్తున్నట్లు సమాచారం.

ఇక విజయ్ ఈ సినిమాలోని ఓ పార్టీ సాంగ్ లో స్పెషల్ డాన్స్ తో ఆకట్టుకోబోతున్నాడట. అయితే ఈ పాటలో సామ్ మాత్రం లేదట. దాంతో ఈ పార్టీ కి సంబంధించిన పాట ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోందట. ఇక ఈ షెడ్యూల్ పూర్తి చేసిన అనంతరం హైదరాబాదులోనే మరొక లొకేషన్ లో సమంతతో కొన్ని సీన్స్ షూట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాలో సరికొత్త ప్రేమ కథను ప్రజెంట్ చేయబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ అలాగే సాంగ్స్ కూడా త్వరలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు.

Share post:

Latest