‘ఊ అంటావా’ సాంగ్ చేయడానికి కారణం అదే.. షాకింగ్ విషయం బయటపెట్టిన స్యామ్

అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా లెవల్ లో విడుదల అయిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అల్లు అర్జున్ యాక్టింగ్, ఆయన భాష ఈ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా సాంగ్స్ ఎంద పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీ వల్లి, ఊ అంటావా మామ.. ఊఊ అంటావా సాంగ్స్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి.

ఇక ఇందులో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఊ అంటావా మామ ఐటెం సాంగ్ లో నటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకే హైలెట్ గా నిలిచిన ఈ సినిమా.. సమంతకు కూడా పేరు తెచ్చింది. తొలిసారిగా సమంత ఇలా ఒక సినిమా ఐటెం సాంగ్ లో నటించింది. ఈ ఐటెం సాంగ్ లో ఆమె గ్లామర్ కుర్రకారును పిచ్చెక్కించింది. తాజాగా ఈ ఐటెం సాంగ్ చేయడం వెనుక అసలు కారణాన్ని సమంత బయటపెట్టింది.

బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా చేస్తునన కాఫీ విత్ కరణ్ టాక్ షో ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అనేక మంది గెస్ట్ లు వచ్చి తమ పర్సనల్ విషయాలు బయటపెడుతున్నారు. తాజాగా ఈ షోకు గెస్ట్ గా అక్షయ్ కుమార్ తో కలిసి సమంత వచ్చింది. ఈ సందర్భంగా ఊ అంటావా సాంగ్ గురించి సమంతను కరణ్ అడిగాడు. అది చేయడానికి గల కారణాలేంటి అని ప్రశ్నించాడు.

సాంగ్ ట్యూన్ చాలా నచ్చిందని, మగవారి చూపులపై సెటైర్ అని తెలిసిందని సమంత తెలిపింది. మగవారి చూపులపై వ్యంగ్యాస్త్రాలు సంధించే ఐటెం సాంగ్ చేసినందుకు తనపై చాలా విమర్శలు వచ్చాయని సమంత తెలిపింది. ఆ సాంగ్ మగవారి చూపులపై వస్తుంది కాబట్టి చాలా ట్రోలింగ్ లు వచ్చాయని, కానీ నాచ్ గర్ల్ గా చేస్తున్న తన లాంటి పెద్ద స్టార్ కాకపోతే మగ చూపులపై ఇంకెవరు సెటైర్ వేయగలరు అంటూ సమంత స్పష్టం చేసింది.

Share post:

Latest