RRR ఒక గే లవ్ స్టోరీ.. రాజమౌళిని రెచ్చకొట్టేలా వ్యాఖ్యలు..!!

RRR..రణం రౌద్రం రుధిరం..దాదాపు నాలుగేళ్లు దర్శక ధీరుడు రాజమౌళి రాత్రి పగలు కష్టపడి..నటులను కష్టపెడుతూ..ఫైనల్ గా తాను ఎనుకున్న ఔట్ పుట్ ఇచ్చి..ఇండియన్ బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగరాసిన డైరెక్టర్ రాజమౌళి. రామ్ చరణ్-NTR ఇద్దరు ఈ సినిమాలో నటన పరంగా కుమ్మేశారు. ఎవ్వరికి ఎవ్వరు తీసిపోకుండా.. వాళ్ళకి ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

ఈ సినిమా రిలీజ్ అయి నెలలు కావస్తున్న ఇంకా బడా సెలబ్స్ RRR సినిమా గురించి పొగుడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. మధ్యలో కొందరు నెగిటీవ్ కామెంట్స్ చేసినా..జనాలు వాటికి పెద్దగా పట్టించుకోలేదు. కొందరు గే సినిమా అన్నా కూడా లైట్ గా తీసుకుంటూ అలాంటి వాటికి కౌంటర్ ఇచ్చారు జక్కన్న ఫ్యాన్స్. కానీ, ఇప్పుడు ఆస్కార్ విన్నింగ్ సౌండ్ విజైనర్ రసూల్ పూక్కుట్టి కూడా RRR ను ఓ గే సినిమా అంటూ కోట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి.. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో సినిమాగా చరిత్రపుటలకెక్కిన ఈ సినిమాను.. ఆస్కార్ విన్నింగ్ సౌండ్ విజైనర్ రసూల్ పూక్కుట్టి .. ‘గే లవ్ స్టోరీ’గా పేర్కొంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఫస్ట్ RRR పై కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేశాడు నటుడు, రచయిత, దర్శకుడు మునీష్ భరద్వాజ్. “నైట్ ఆర్ఆర్ఆర్ అనే ఒక చెత్త సినిమాను చూశాను” అంటూ ట్వీట్ చేయగా..దానికి వత్తాసు పలుకుతూ.. “RRR అనేది ఒక గే లవ్ స్టోరీ” అని రసూల్ రీట్వీట్ చేశాడు. దీంతో రసూల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి..ఆయనను జనాలు బూతులు తిట్టేలా చేసుకుంది. జక్కన్న పాపులారిటీని చూసి జీర్ణించుకోలేక అసూయతో ఇలాంటి దరిద్రపు కామెంట్స్ చేస్తున్నారని రసూల్‌ని తిట్టిపోస్తున్నారు.