ఓవర్ నైట్ స్టార్లు వీరు.. కానీ అనతికాలంలోనే కనుమరుగయ్యారు? ఇంతకీ ఎవరంటే?

సినిమా పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు స్టార్ డం వస్తుందో తెలియదు. అయితే స్టార్ డం వచ్చినవారు అందరూ దానిని వినియోగించుకోలేరు. అయితే దానికి ఫలానా అని కారణం ఇది అని మనం చెప్పలేము. విధి ఆడిన వింత నాటకంలో కొందరు విగతజీవులుగా మారుతారు. మరికొంతమంది వున్నత శిఖరాలను అధిరోహించి అశేష అభిమానులను సొంతం చేసుకుంటారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే ఇక్కడ క్లిక్ అవుతారు. ఇపుడు కేవలం ఒకే ఒక్క సినిమాతో స్టార్లు అయ్యి, తరువాత కనుమరుగైనవారి గురించి తెలుసుకుందాం.

ఉల్లాసంగా ఉత్సాహంగా.. & 7/G బృందావన కాలనీ:

ఈ సినిమా పేర్లు వినగానే ముందుగా అందులో నటించినటువంటి హీరోలే మనకు గుర్తుకు వస్తారు. ఎందుకంటే అంతలాగ వారు తమ నటనతో సినీ ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టారు కనుక. ఇతర సినీ ఇండస్ట్రీలతో పోల్చుకుంటే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోలు మొదటి సినిమాతోనే మంచి పేరు ప్రఖ్యాతలు గడించి ఆ ఒక్క సినిమాతోనే తమ జీవితాన్ని కూడా ముగించుకోవడం చాలా బాధాకరం. ఈ రెండు సినిమాలలో హీరోలు మంచి మార్క్ క్రియేట్ అయితే చేసారు గాని దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. అయితే దురదృష్టవశాత్తు వారు కనుమరుగవ్వడం సినీ ప్రపంచానికి తీరని లోటు అని చెప్పుకోవాలి.

ప్రేమికుల రోజు/చిత్రం:

అలాంటి మరో ఇద్దరే హీరో ఉదయ్ కిరణ్ అండ్ హీరో కునాల్. 1990లో కదిర్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమికుల రోజు’ సినిమా అప్పటి యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఈయన కూడా ఈ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకొని అంతలోనే ఈ లోకం నుండి దూరం అయ్యాడు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ఆయన వ్యక్తిగతంగా కూడా అనేక సమస్యలను ఎదుర్కోవడంతో తట్టుకోలేక 30 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకొని ఈ లోకంనుండి నిష్క్రమించాడు. ఇదే కోవకు చెందుతాడు ఉదయ్ కిరణ్. వరుస రెండు మూడు సినిమాలు హిట్లతో మంచి పేరు తెచ్చుకొని.. అంతలోనే తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యాడు.