2024 ఎన్నిక‌ల‌పై ప‌వ‌న్ జ‌న‌సేన‌లో కొత్త‌ గుబులు..!

రాష్ట్రంలో ప్ర‌శ్నిస్తానంటూ పార్టీ పెట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఎలాం టి సీన్ క‌నిపిస్తోందో.. ఇప్పుడు కూడా అదే సీన్ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. అప్ప‌ట్లో ప‌వ‌న్ ఎక్క‌డ స‌భ పెట్టినా.. ఎక్క‌డ ఎలాంటి కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా.. భారీ ఎత్తున అభిమానులు పోటెత్తారు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న నిర్వ‌హించిన స‌భ‌ల‌కు యువ‌త జిల్లాలు .. దాటుకుని మ‌రీ.. వెళ్లి జ‌న‌సేనానినికి జై కొట్టారు.

అంతేకాదు.. కాబోయే సీఎం .. అంటూ.. నినాదాల‌తో అట్టుడికించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. ఈ నినాదాలు.. ఈ పోటెత్త‌డాలు.. వంటివి ఎన్నిక‌ల‌కు వ‌చ్చేసరికి ఓటెత్త‌లేక‌పోయాయి. అంటే.. జ‌న‌సేన‌కు ఆశించిన విదంగా ఓట్లు రాల‌లేక‌పోయాయి. ఇది నిష్టుర స‌త్యం. ఎవ‌రిని క‌దిపినా.. ప‌వ‌న్ అభిమానులే.. ప‌వ‌న్ అంటే.. న‌రాలు తెగిపోయే ప్రేమ కురిపించేవారే. కానీ, వాస్త‌వంలోకి వ‌చ్చేస‌రికి మాత్రం.. అంతా రివ‌ర్స్ అవుతోంది. ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి ఎవ‌రి ఆబ్లిగేష‌న్స్ వారికి ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా గోదావ‌రి జిల్లాల్లో నిర్వ‌హించిన స‌భ‌ల‌కు.. ప‌రామ‌ర్శ‌ల‌కుకూడా అంతే సంఖ్య‌లో యువ‌త పోటెత్తారు. భారీ ఎత్తున జిల్లాలు దాటుకునిమ‌రీ.. త‌మ అభిమానిని.. నాయ‌కుడిని చూసేందుకు వ‌చ్చారు. మ‌రి.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో అయినా.. వీరు జ‌న‌సేనకు ఓటేస్తారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల సందేహం. బ‌హుశ అందుకేనేమో.,. ప‌వ‌న్ ఒక సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. త‌ను ఎవ‌రికి టికెట్ ఇచ్చినా.. త‌న‌ను చూసి ఓటేయాల‌ని కోరారు. అంటే.. అభ్య‌ర్థుల‌ను కాకుండా.. త‌నను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలన్నారు.

పోనీ.. ఇదే వాస్త‌వం అనుకుందాం. అయితే.. అదే ప‌వ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో రెండు స్థానాలు.. భీమ‌వ‌రం, గాజువాక‌ల్లో పోటీ చేసి.. విజ‌యం ద‌క్కించుకున్నారా? అంటే.. లేదు. సో.. అప్పుడు ప‌వ‌న్ చూసి ఎవ‌రూ ఓటేయ‌లేద‌ని.. స్ప‌ష్టంగా తెలిసిపోతోంది. ఈ నేప‌థ్యంలో పార్టీలో ఏదో మార్పు అయితే.. రావాల్సి ఉంది. త‌న‌ను చూసి స‌భ‌ల‌కు వ‌స్తున్న‌వారు… త‌న‌ను సీఎం అంటూ.. సంబోధిస్తున్న‌వారు.. ఓటేయ‌లేదు. సో.. దీనిని బ‌ట్టి.. ఈ రెండు వ్యూహాలు విఫ‌ల‌మైన నేప‌థ్యంలో మ‌రో కొత్త వ్యూహానికి ప‌దును పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Share post:

Latest