తన భార్యపై ప్రేమను ఏకంగా అలా చూపించిన కళ్యాణ్ రామ్..!

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన నటులలో నందమూరి తారక రామారావు వారసులుగా నందమూరి బాలకృష్ణ,ఆయన వారసులుగా నందమూరి కళ్యాణ్ రామ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా స్టార్ హీరోల రేంజ్ లో దూసుకుపోతుంటే కళ్యాణ్ రామ్ మాత్రం అడపా దడపా సినిమాలు చేస్తూ నిర్మాణ రంగానికి ఆయన పరిమితం అవుతూ వస్తున్నారు.

ఇకపోతే ఇటీవల కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈసారి కళ్యాణ్ రామ్ కు పక్క సూపర్ హిట్ అని ప్రేక్షకులు సైతం అంటున్నారు.ఇదిలా ఉండగా బింబిసారా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా కళ్యాణ్ రామ్ చేతికి వేయించుకున్న పచ్చబొట్టు గురించి సర్వత్ర చర్చ జరుగుతోంది. ఇక కళ్యాణ్ రామ్ తన భార్య స్వాతి పేరును పచ్చబొట్టుగా వేయించుకోవడం గమనార్హం. నిజానికి కళ్యాణ్ రామ్ భార్య స్వాతి వృత్తి రీత్యా వైద్యురాలు కావడం గమనార్హం.

ఇక 2006 సంవత్సరం ఆగస్టు 10వ తేదీన కళ్యాణ్ రామ్ , స్వాతిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇకపోతే కళ్యాణ్ రామ్ తన భార్య మీద ఉన్న ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలియక ఏకంగా ఆమె పేరును కుడి చేతి పైన మణికట్టు కింద పచ్చబొట్టు వేయించుకోవడం జరిగింది . దీన్ని బట్టి చూస్తే భార్య అంటే కళ్యాణ్ రామ్ కు ఎంత ఇష్టమో అంటూ తెగ పొగిడేస్తున్నారు నెటిజన్స్.

ఇకపోతే స్వాతి ధనవంతుల కుటుంబం నుంచి రాగా ఆమె ఫ్యామిలీ పలు వ్యాపారాలను నిర్వహిస్తూ ఉంటుంది. ఇకపోతే స్వాతి సొంతంగా గ్రాఫిక్స్ సంస్థను కూడా నడుపుతోంది. ఇక ఎంబిబిఎస్ చదివిన ఈమె వైద్య వృత్తికి దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలు చేపట్టింది. అయితే ఇక కళ్యాణ్ రామ్ స్వాతిలదు పెద్దల కుదుర్చిన వివాహం. ఇక కళ్యాణ్ రామ్ కు అన్ని విధాలా సపోర్ట్ చేసేవారిలో ఆయన భార్య స్వాతి ముందు వరుసలో ఉంటారు.