ఆచార్య ఎఫెక్ట్: చిరంజీవి పేరులో కొత్త మార్పులు..మెగాస్టార్ సంచలన నిర్ణయం.. ?

యస్..టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మెగాస్టార్ అంటే ఓ బ్రాండ్ అని అంటుంటారు అందరు..మరి ఆ మెగాస్టార్ చిరంజివీ తన పేరు ను ఎందుకు మార్చుకున్నారో మాత్రం తెలియడం లేదు. జనాభా నానారకాలుగా అనుకుంటున్నా..ఆయన మాత్రం పెదవి విప్పడం లేదు. దీంతో ఈ ఇష్యూ ఇండస్ట్రీలో ట్రెండింగా మారింది.

హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా..మెగాస్టార్ వరుస సినిమా అవకాశాలతో బిజీ గా ఉంటున్న సంగతి తెలిసిందే. భోళా శంకర్, వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్..ఇలా వరుసగా సినిమా షూటింగ్ లకు అటెండ్ అవుతూ యంగ్ హీరోలకు గట్టి పోటి ఇస్తున్నాడు . అయితే, రీసెంట్ గా రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ లుక్ లో ఆయన పేరు మార్చుకున్నారు.

ముందు నుండి “CHIRANJEEVI” అని రాసే ఆయన్..ఇప్పుడు “CHIRANJEEEVI” అంటూ రాసుకొచ్చారు. ఆయన పేరు లో ఓ కొత్త లెటర్ యాడ్ చేసుకున్నాడు. న్యూమరాలజీ ప్రకారం అలా మరో ” E “యాడ్ అయితే, చిరు కి ఇక తిరుగుండదట. అందుకోసమే..ఇలా సినిమాల కోసం పేరు ను మార్చుకున్నాడు. అయితే, కొందరు మాత్రం.. దీనికి కారణం కొరటాల ఆచార్య అని..ఆ సినిమా ఫ్లాప్ తోనే చిరు ఇలా పేరులో మార్పులు చేశాడని అంటున్నారు. సినిమా ప్రపంచంలో సెంటిమెంట్స్ అనేవి కామన్ నే అయినా..మెగాస్టార్ కూడా ఈ రేంజ్ లో సెంటి మెంట్ లను నమ్ముతారా అనేది ఆశ్చర్యంగా ఉంది. మరి చూడాలి ఈ కొత్త లెటర్ కొత్త గా ఏం మారుస్తుందో..?