చినబాబు ఎఫెక్ట్: కంచుకోటకు డ్యామేజ్..?

సొంత తప్పిదాలు, గ్రూపు తగాదాలు, మెరుగ్గా పనిచేయకపోవడం..ఇలా చెప్పుకుంటూ పోతే పలు కారణాల వల్ల కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ బలపడలేకపోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది…మరి ఈ వ్యతిరేకతని ఉపయోగించుకుని టీడీపీ నేతలు బలపడొచ్చు. కానీ అలా చేయడం లేదు. ఎక్కడకక్కడ గ్రూపు తగాదాల వల్ల గెలిచే సీటులో కూడా టీడీపీ ఓడిపోయే పరిస్తితికి వెళుతుంది.

ఇలాంటి పరిస్తితి వల్లే కంచుకోట లాంటి పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ దెబ్బతినేలా ఉంది. ఇక్కడ గెలిచింది ఒక్కసారైనా…ఇక్కడ టీడీపీ చాలా స్ట్రాంగ్. గత ఎన్నికల్లో ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని అంతా అనుకున్నారు..కానీ జనసేన ఓట్లు చీల్చడం…జగన్ వేవ్ వల్ల టీడీపీ ఓడిపోయింది. అయితే ఈ సారి ఎలాగైనా గెలవాలనే కసితో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పనిచేస్తున్నారు..ఇక్కడ ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. అలాగే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి అంత పాజిటివ్ కూడా కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో నెక్స్ట్ పెనమలూరులో బోడే ప్రసాద్ కు గెలుపు అవకాశాలు పెరిగాయి. ఇలాంటి సమయంలోనే టీడీపీలో ఉన్న గ్రూపులు పెద్ద సమస్యగా మారాయి. ఇప్పటికే యలమంచిలి రాజేంద్రప్రసాద్ సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు…అయితే ఎన్నికల సమయంలో ఆయన టీడీపీ కోసం…బోడేకు మద్ధతుగా ఉండే ఛాన్స్ ఉంది.

కానీ ఇక్కడ లోకేష్ టీం హడావిడి ఎక్కువైంది..దేవినేని గౌతం(పండు) సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు. లోకేష్ ఆశీస్సులతో పండు వర్గం నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వేరుగా రాజకీయం చేయడం వల్ల…టీడీపీలో గ్రూపులు మొదలయ్యాయి. ఇదే బోడేకు పెద్ద తలనొప్పిగా మారింది…ఎవరికి వారు సెపరేట్ గా పార్టీ కార్యక్రమాలు చేయడం…ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకోవడం చేస్తున్నారు. దీని వల్ల నియోజకవర్గంలో టీడీపీ కేడర్ అయోమయంలో పడింది. అంతా కలిసికట్టుగా పనిచేయకుండా ఇలా విడివిడిగా ముందుకెళ్లడంతో పెనమలూరులో టీడీపీకి మళ్ళీ ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. గౌతం గాని బోడేకు సపోర్ట్ ఇస్తే బాగానే ఉంటుంది…లేదు చినబాబు సపోర్ట్ ఉందని హడావిడి చేస్తే…నష్టపోయేది టీడీపీనే.