లైగర్ లెక్కలు : నెలకు అరకోటి దానికోసమే ఖర్చు పెట్టిన పూరి జగన్నాధ్..నువ్వు మామూలోడివి కాదురా సామి..!

ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ రెండు ఇండస్ట్రీలు ఆశగా ఎదురు చూస్తున్న సినిమా “లైగర్”. నిజానికి బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమా కోసం ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. దానికి కారణం కొందరికి విజయ్ మీద ఉండే క్రష్. కుర్రాడు అర్జున్ రెడ్డి సినిమాతో అలాంటి పేరు సంపాదించుకున్నాడు. ఆ తరువాత విజయ్ ఆ స్దాయి హిట్ అందుకోకపోయినా..ఆ పేరు, క్రేజ్ మాత్రం పై పైకి పెరిగిపోతూనే ఉంది. ఇక అలా టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ తో జోడీ కుదిరిన ఈయన లైగర్ సినిమా ను ఓకే చేసాడు. ఇంకో సినిమాకూడా పూరీ దర్శకత్వంలోనే చేయడానికి సైన్ కూడా చేశారు.

ప్రజెంట్ లైగర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు పూరి, విజయ్. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని అంత భావిస్తున్నారు. ఫుల్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు 25న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ డిసైడ్ చేశారు. అయితే, తాజాగా ఈ సినిమా గురించి ఓ మ్యాటర్ ఇండస్ట్రీ వర్గాల్లో హైలెట్ గా ట్రెండ్ అవుతుంది. లైగర్ షూటింగ్ మొదలై చాలా కాలమే అయ్యింది. కరోనా కారణంగా కొన్ని సార్లు షెడ్యూల్స్ కి బ్రేకులు పడుతూ వచ్చాయి.

దీంతో సినిమా కి అనుకున్న బడ్జెట్ కూడా దాటిపోయింది. సినిమా షూట్ ఖర్చుల కన్నా కూడా పూరీ ముంబై ఖర్చులే ఎక్కువగా ఉన్నాయట. మనకు తెలిసిందే లైగర్ సినిమా షూటింగ్ చాలా వరకు అంతా ముంబై లోనే జరిగింది. ఇస్మార్ట్ శంకర్ తరువాత వెంటనే స్క్రిప్ట్ కి సంబంధించిన వర్క్స్ కోసం పూరీ ముంబై చెక్కేశాడు. అయితే కోవిడ్ కారణంగా ముంబైలోనే ఉండిపోవాల్సి వచ్చింది పూరి అండ్ టీమ్. దీంతో అందరికి హోటల్ ఖర్చులకు, ఫ్లైట్ ఖర్చులకు..మిగత పరసనల్ ఖర్చులకు..అటు ఇటుగా రఫ్ గా రూ.20 కోట్లకు దగ్గరగా ఖర్చయినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకున్న పూరీ లైగర్ సినిమా కోసం నెలకు అరకోటికి పైగానే ఖర్చు చేశారన్నమాట.

ప్రజెంట్ పూరి ఉన్న పోజీషన్ లో ఈ రేంజ్ ఖర్చులు ఆయనకు తలకు మించిన భారం అనే చెప్పాలి. టాలీవుడ్ వర్గాలు పూరీ ఎక్స్ పెన్సీవ్ ఖర్చులు చూసి షాక్ అవుతున్నారు. ఇంత ఖర్చయి ఉంటుందా..? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ముంబై కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే.. ఈ ఖర్చులు అయ్యాయి అనే చెప్పాలి. ఈ మూడేళ్లలో లైగర్ టీమ్ అంతా అక్కడ ఉండడానికి, ఇతర మెయింటైనెన్స్ కు ఆ మాత్రం క్రచు అయ్యుంటుంది అంటున్నారు. చేతిలో తగ్గిన డబ్బు లేకపోయిన ఈ రేంజ్ లో దర్జా గా ఖర్చు చేయడం పూరికే చెల్లింది..అందుకే ఆయన ని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటారు అంటున్నారు నెటిజన్స్. మరి చూడాలి సినిమా ఎన్ని లాభాలు తీసుకువస్తుందో..?