తీరని కోరిక అది.. ఎప్పటికైనా తీర్చేసుకుంటా: సురేఖ వాణి

టాలీవుడ్ ఇండస్ట్రీలో వున్న క్యారెక్టర్ ఆర్టిస్టులతో వున్న చెప్పుకోదగ్గ నటి నటులలో నటి సురేఖవాణి ఒకరు. ఆమె ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె సినిమాల్లో ఎంత బిజీగా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతే బిజీగా ఉంటుంది. అవును… సురేఖ వాణి నిత్యం తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతాఇంతా కాదు. వీరిద్దరూ తల్లి కూతుర్లుగా కాకుండా స్నేహితులుగా ఎంతో సరదాగా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తూ ఉంటారు. ఇక సురేఖ వాణి తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

అలా ఆమె కొన్నిసార్లు చేసే పోస్టులకు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా ఎదురవుతాయి. అయితే వీటన్నింటినీ ఏ మాత్రం పట్టించుకోకుండా ఆమె తమదైన శైలిలో వారి అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇక సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయర్స్ సంఖ్య తక్కువేమి కాదు. తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తున్నారని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక సురేఖ వాణి సినిమాల విషయంలో కూడా బాగా డబ్బులు కూడబెట్టినట్లు సమాచారం.

అసలు విషయంలోకి వెళితే, మన మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న చేస్తున్న ‘లేచింది మహిళా లోకం’ అనే సినిమాలో సుప్రీత చిన్న పాత్రలో నటిస్తోంది. ఈ విధంగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఈమె త్వరలోనే హీరోయిన్ గా కూడా నటిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే సురేఖ వాణి తాజాగా సోషల్ మీడియా వేదికగా రేంజ్ రోవర్ కారు ఫోటోని షేర్ చేస్తూ మై డ్రీమ్ కారు అంటూ క్యాప్షన్ పెట్టారు. ఎప్పటికైనా తను రేంజ్ రోవర్ కారు కొనాలని కోరిక ఉందని, ఎలాగైనా తన కోరికను నెరవేర్చుకుంటానని ఈ సందర్భంగా ఈమె తన డ్రీమ్ కార్ గురించి వెల్లడించారు.

Share post:

Latest