కోడెల వారసుడుతో కష్టమే?

ఏపీ రాజకీయాల్లో దివంగత కోడెల శివప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…దశాబ్దాల పాటు టీడీపీ కోసం పనిచేసిన ఆయన..గత ఎన్నికల తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. అయితే కోడెల ఆత్మహత్యకు అనేక కారణాలు చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ రాజకీయంగా ఒత్తిడి చేయడం. కేసులు పెట్టడం లాంటివి తట్టుకోలేక ఆయన చనిపోయారని టీడీపీ వాళ్ళు అంటారు.

అయితే కొడుకు, కుమార్తె చేసిన అక్రమాలు వల్ల కోడెల నలిగిపోవడం, అలాగే చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్ల ఆయన చనిపోయారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తారు. కానీ ఏదేమైనా గాని చివరికి కోడెల బ్రతికి లేరు. ఇక కోడెల స్థానంలోకి ఆయన తనయుడు శివరాం వచ్చారు. కాకపోతే కోడెల మాదిరిగా శివరాంకు ఫాలోయింగ్ తక్కువ..అలాగే ఆయనకు అంత పాజిటివ్ కూడా లేదు. సొంత పార్టీలోనే ఈయనపై వ్యతిరేకత ఉంది.

Guntur: Dr Kodela remembered on death anniversary

అందుకే సత్తెనపల్లి సీటు శివరాంకు ఇవ్వొద్దని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తూ ఉంటారు. అయితే శివరాంకు నెగిటివ్ ఎక్కువ ఉందనే చెప్పాలి…టీడీపీ అధికారంలో ఉండగా ఈయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అలాగే సత్తెనపల్లి, నరసారావుపేట నియోజకవర్గాల్లో కె ట్యాక్స్ పేరిట దందాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇంకా వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈయనపై అనేక కేసులు వచ్చి పడ్డాయి.

ఇదే క్రమంలో తాజాగా ఓ చీటింగ్ కేసు కూడా బయటపడింది. టీడీపీ అధికారంలో ఉండగా యలవర్తి సునీత, పాలడుగు బాల వెంకట్ సురేశ్ అనే వారి చేత తన కంపెనీలో శివరాం పెట్టుబడులు పెట్టించుకుని..వారికి సంవత్సరంలో తిరిగి ఇస్తానని చెప్పి…శివరాం ఇవ్వలేదంట…ఇప్పుడు వారు శివరాంపై చీటింగ్ కేసు పెట్టారు. ఇలా అనేక కేసులు శివరాంపై వచ్చి పడ్డాయి. ఇలాంటి తరుణంలో శివరాంకు సీటు ఇస్తే…గెలవడం కష్టం అని సొంత పార్టీ వాళ్లే మాట్లాడుకుంటున్నారు. మరి శివరాం విషయంలో చంద్రబాబు ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి.

Share post:

Latest