లేటైనా NTRతోనే సినిమా చేస్తా.. మరెవ్వరితోను చెయ్యను అనేస్తున్న దర్శకుడు! 

తెలుగు సినిమా పరిశ్రమలో చెప్పకోదగ్గ నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఎలాంటి సినిమా దర్శకుడైన అలాంటి హీరోలతో సినిమాలు చేయాలని కలలు కంటారు. అయితే అదేపనిగా అతనికోసం సినిమా చేయాలని సంవత్సరాలు తరబడి వెయిట్ చెయ్యరు. ఇక్కడ సరిగ్గా అలాంటిదే జరిగింది. మొదటి సినిమా ఉప్పెనతో మంచి విజయం సాధించిన దర్శకుడు బుచ్చిబాబు. ఉప్పెన సినిమా తర్వాత తన సెకండ్ సినిమాను వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు. ఎందుకంటే ఓ కథతో ఎన్టీఆర్ ని ఒప్పించాడు గాని, డేట్స్ ఖాళీలేక కాంబినేషన్ కుదరడంలేదు.


ఎన్టీఆర్ తో మంచి సాన్నిహిత్యం ఉండటంతో బుచ్చి బాబు పదేపదే చర్చలు జరుపుతున్నాడు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా వుంది. ఈ రెండు ప్రాజెక్టుల తరువాత ప్రాజెక్ట్ ఉంటుంది అని ఆ మధ్య ఒక టాక్ వినిపించింది. కానీ అందులో ఓ క్లారిటీ లేదు. బుచ్చి బాబుకు మిడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసే చాన్స్ వస్తున్నప్పటికీ కూడా అతను ఎన్టీఆర్ తోనే పెద్ద సినిమా చేయాలి అని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

అయితే ఎన్టీఆర్ ఫ్రీ కావడానికి దాదాపు ఒక సంవత్సరం పైనే సమయం పడుతుంది. అయితే ఈ క్రమంలో అతను సమయం వృధా చేయకుండా తన గురువు సుకుమార్ తో కలిసి పుష్ప సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ చర్చలో పాల్గొంటూ ఉండటం విశేషం. సుకుమార్ కు బుచ్చిబాబు టాలెంట్ ఏమిటో బాగా తెలుసు. అందుకని అతనిని ఈ ప్రాజెక్టులో భాగం చేసుకున్నాడు సుకుమార్. ఎలాగో ఇప్పట్లో ఎన్టీఆర్ డేట్స్ దొరికే అవకాశం లేదు కాబట్టి ఆ లోపు గ్యాప్ ఇవ్వడం ఎందుకని పుష్ప కోసం వర్క్ చేస్తున్నాడు బుచ్చిబాబు. పుష్ప అనంతరం ఎన్టీఆర్ సినిమాను గ్రాండ్ గా స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నాడు. తనకోరిక నెరవేరాలని ఆశిద్దాం.