2024పై జ‌గ‌న్ స‌రికొత్త ఫార్ములా.. అధిరిపోయే ట్విస్టు..!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు వేస్తారో.. నాయ‌కుల‌కే తెలియాలి. ముఖ్యంగా.. వైసీపీ వంటి బ‌ల మైన ప్ర‌జాభిమానం.. భారీ సంఖ్య‌లో సీట్లు ఉన్న పార్టీ మ‌ళ్లీ ఆ ప్ర‌భావం నిలుపుకునేలా.. ప్ర‌జ‌ల నుంచి అంత‌కుమించిన మ‌ద్ద‌తు తెచ్చుకునేలా.. ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహాలు లేవు. ఈ క్ర‌మంలోనే వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు రెండేళ్ల ముందునుంచే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌లు ఏదో.. ఆషామాషీగా జ‌రిపించేసి.. మ‌మ అని అనుకునేందుకు జ‌గ‌న్ అయితే సిద్ధంగా లేరు. ఎందుకంటే.. గ‌తంలో వ‌చ్చిన 151 సీట్లును మించి అన్న‌ట్టుగా.. ఆయ‌న ల‌క్ష్యం పెట్టుకు న్నారు. ఏకంగా 175 సీట్ల‌కు 175 ఎందుకు సాధించ‌లేమ‌ని.. ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. ఆ దిశ‌గానే ఆయ‌న ప్ర‌య‌త్నాలు కూడా చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేల‌ను గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు పంపించ‌డం..వారితో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించేలా చేయ‌డం వంటివి చేస్తున్నారు.

అయితే.. ఇప్పుడు జ‌గ‌న్ వ్యూహం మార్చుకున్నార‌ని.. వైసీపీ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. అదేంటంటే.. వ‌చ్చే ఎన్నిక‌లు `యూత్‌` సెంట్రిక్‌గానే జ‌ర‌గనున్నాయి. దీంతో యువ‌త‌కు ప్రాధాన్యం పెంచాల‌ని.. జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి.. వైసీపీ టికెట్ల‌ను 45 ఏళ్ల‌లోపు పురుషులు.. మ‌హిళ‌ల‌కు 55 శాతం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నార‌ని.. నాయ‌కులు చెబుతున్నారు. ఇక‌, మిగిలిన‌వారిలో 50-55 ఏళ్ల వారికి 35 శాతం ఇవ్వ‌నున్నార‌ని అంటున్నారు.

మిగిలిన 10 శాతం మాత్ర‌మే.. 55 ఏళ్లు పైబ‌డిన వారికి అది కూడా అత్యంత కీల‌క‌మ‌ని అనుకుంటే.. మాత్ర మే ఇవ్వ‌నున్నార‌ని.. పార్టీలో చ‌ర్చ సాగుతోంది. త‌ద్వారా.. యువ ర‌క్తం తొణికిస‌లాడుతున్న పార్టీగా.. వైసీపీ ని ముందు నిల‌బెట్టి.. ప్ర‌తిప‌క్షాల‌కు చుక్క‌లు చూపించాల‌ని జగ‌న్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే.. ప్ర‌స్తుతం ఈ ఫార్ములాపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో 45 ఏళ్ల లోపు వారికి 40 శాతం టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు వారికి మ‌రో 15 శాతం పెంచ‌నున్నారు. దీనిని బ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో యూత్ సెంట్రిక్‌గా జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Share post:

Latest