మ‌హిళా మంత్రికి క్లాస్‌.. వైసీపీలో హాట్ టాపిక్‌…!

ఏపీలో న‌లుగురు మ‌హిళా మంత్రులు ఉన్నారు. వీరిలోనూ ఒక‌రు ఎస్సీ, ఇద్ద‌రు బీసీ, ఒక‌రు ఓసీ అనే విష యం తెలిసిందే. ఇక‌, వీరి ప‌నితీరు చూస్తే.. ఎవ‌రికి వారు ..ఫైర్‌బ్రాండ్స్‌గానే గుర్తింపు పొందారు. అయితే.. మంత్రులుగా ప‌ద‌వులు చేప‌ట్టాక‌..ఈ న‌లుగురు మంత్రుల్లో ఇద్ద‌రు వివాదాల‌కు చేరువ‌య్యారు. ఏకంగా.. తన ప‌ర్య‌ట‌న‌లో ట్రాఫిక్ ఆపు చేయ‌డంతో ఒక చిన్నారి మృతి చెందిన ఘ‌ట‌న‌తో మంత్రి ఉషా శ్రీచ‌ర‌ణ్ వివాదానికి సెంట్రిక్ అయ్యారు.

మ‌రో మంత్రి తానేటి వ‌నిత‌.. రాష్ట్రంలో మ‌హిళ‌లు, యువ‌తుల‌పై జ‌రుగుతున్న అకృత్యాల విష‌యంలో త‌ల్లిదే బాధ్య‌త అన్న‌ట్టు వ్యాఖ్యానించారు. “త‌ల్లుల పెంప‌కం స‌రిగా ఉంటే.. ఇలాంటి వి జ‌ర‌గ‌వు“ అని.. వ‌నిత వ్యాఖ్యానించారు. ఇవి తీవ్ర వివాదానికి దారితీశాయి. ప్ర‌తిప‌క్షాలు.. స‌ద‌రు మంత్రిపై తీవ్ర విమ‌ర్శ లు గుప్పించాయి. అయితే.. ఈ విమ‌ర్శ‌లను.. ఇత‌ర‌త్రా వివాదాల‌ను కూడా అధిష్టానం అప్ప‌టి వ‌ర‌కు పెద్ద సీరియ‌స్‌గా తీసుకోలేదు.

కానీ, త‌ర్వాత కూడా వ‌నిత‌.. విమ‌ర్శ‌ల‌ను కొన‌సాగించారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కే వలంటీరు ఉద్యోగాలు ఇచ్చా మని అన్నారు. అంతేకాదు.. నాయ‌కులు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు చూపించిన వారినే వ‌లంటీర్లుగా తీసు కున్న‌ట్టు చెప్పారు. ఈ వ్యాఖ్య‌లు మ‌రింత‌గా ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాయి. ఈ నేప‌థ్యంలోనే వ‌నిత‌కు తాడేప‌ల్లి నుంచి పెద్ద ఎత్తున క్లాస్ తీసుకున్నార‌ని.. వైసీపీలో గుస‌గుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో వ‌నిత దూకుడు త‌గ్గించార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

నిజానికి త‌ర‌చుగా.. మీడియాలో ఉండే వ‌నిత ఇటీవ‌ల కాలంలో దూకుడు త‌గ్గించారు. మీడియాకు క‌నిపిం చ‌డం లేదు. ఆమె వాయిస్ కూడా వినిపించ‌డం లేదు. ఏదైనా కార్య‌క్ర‌మానికి వ‌చ్చినా.. ఆచితూచి మాట్లా డి వెళ్లిపోతున్నారు. మీడియాతో అయితే.. ముభావంగానే మాట్లాడుతున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిం చిన వారు తాడేప‌ల్లి ఆఫీస్‌.. మంత్రిని బాగానే కంట్రోల్ చేసిన‌ట్టు ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఈ ప‌రిణా మంతో ఆమె ఫుల్లుగా సైలెంట్ అవుతారో.. లేక మ‌ళ్లీ మునుప‌టిలా పుంజుకుంటారో చూడాలి.