రాధా క్లారిటీ ఇచ్చేది అప్పుడేనా?

ఏపీలో కాపు వర్గంలో అగ్రనేతగా ఉన్న వంగవీటి రాధా రాజకీయ పయనం ఎటువైపు వెళుతుందో ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. వరుసగా రాజకీయాల్లో ఫెయిల్ అవుతూ వస్తున్న రాధా…రాజకీయ భవిష్యత్తుపై కాపు వర్గం బాగానే బెంగ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఒక్క 2004లోనే రాధా రాజకీయంగా సక్సెస్ అయ్యారు. అప్పుడే ఎమ్మెల్యేగా గెలిచారు…ఆ తర్వాత వరుసగా పార్టీలు మారిన….నియోజకవర్గాలు మారిన విజయం మాత్రం దక్కలేదు. చివరికి వైసీపీలో తనకు గౌరవం లేదని చెప్పి…వంగవీటి ఫ్యామిలీ బద్ధశత్రువుగా భావించే టీడీపీలోకి వచ్చారు.

టీడీపీలో పోటీ చేయకపోయిన…ఆ పార్టీ కోసం పనిచేశారు. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడింది. అక్కడ నుంచి రాధా రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడింది. టీడీపీలో ఉన్నారో లేదో తెలియడం లేదు..అలా అని వేరే పార్టీలోకి వెళ్తారో లేదో క్లారిటీ లేదు. ఒకసారి ఏమో పవన్ తో రాధా భేటీ అయ్యారని, జనసేనలోకి వెళ్తారని ప్రచారం…మరోసారి కొడాలి నాని, వంశీలని రాధా కలుస్తూ ఉంటారు..దీంతో ఆయన వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. ఇక చంద్రబాబు సైతం…రాధాని వదలడం లేదు.

ఇలా అన్నివైపులా రాధా రాజకీయం కన్ఫ్యూజన్ గానే ఉంది. ఇప్పటిలో రాధా రాజకీయంపై క్లారిటీ వచ్చేలా లేదు. కాకపోతే ఆయన వైసీపీ వైపుకు మళ్ళీ వెళ్ళడం కష్టమే అని తెలుస్తోంది…అక్కడ ఎన్నో అవమానాలు జరిగాయని రాధానే చెప్పారు…అలాంటప్పుడు మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళడం కష్టమే. అలా అని టీడీపీలో యాక్టివ్ గా పనిచేస్తారా? అనేది క్లారిటీ లేదు. అయితే రాధా ఎన్నికల ముందు క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

అలాగే టీడీపీ-జనసేన పొత్తు ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీల కోసం పనిచేస్తారని తెలుస్తోంది. ఇక పోటీ చేసే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. మరి చూడాలి ఎన్నికల సమయంలోనైనా రాధా క్లారిటీ ఇస్తారేమో.