నాగచైతన్య ‘ఎఫైర్’ నిజమేనా?

అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం చైతన్య నటించిన 25 సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటిలో ‘థాంక్యూ’ స్ట్రెయిట్ తెలుగు సినిమా కాగా లాల్ సింగ్ చద్దా హిందీ సినిమా. ఈ చిత్రం తెలుగు తమిళంలో కూడా అనువాదమై విడుదలవుతోంది. అందువల్ల చైతన్య ఇకపై పూర్తిగా ప్రమోషన్స్ తోనే పూర్తి సమయం గడపాల్సి వస్తోంది. థాంక్యూ ఈనెల 22న విడుదలవుతోంది. ఇప్పటికే చైతన్య ప్రమోషన్స్ ని ముగించాడు. లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 11న విడుదల కానుంది. కాబట్టి కంటిన్యూషన్ ప్రమోషన్స్ తో అతడు బిజీగా ఉంటాడు.

ఈ ఎఫైర్ నిజమేనా?

అయితే నాగచైతన్య ఓ ప్రశ్నను తప్పించుకుంటున్నాడు? మీడియా ఆ ప్రశ్న వేసినపుడు ఏదోఒక తెలివైన ఆన్సర్ చెప్పి ఈజీగా తప్పించుకుంటున్నాడు. అయితే స్థానిక మీడియాని ఎలాగోలా మ్యానేజ్ చేయగలిగినా కానీ జాతీయ మీడియాని మ్యానేజ్ చేయడమెలా? అనేది ఇపుడు చర్చనీయంశంగా మారింది. ఇంతకీ ఈ ప్రశ్న ఏమంటే, కొన్నాళ్ల క్రితం చే సామ్ నుండి విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే దీనికి కారణం అందాల కథానాయిక శోభిత ధూళిపాలతో నాగచైతన్య ఎఫైర్ అని కూడా మీడియాలో కథనాలొచ్చాయి.

నిజమేనని అంటున్నారు?

అయితే తాజాగా థాంక్యూ ఇంటర్వ్యూల్లో స్థానిక మీడియాలు ఈ రకమైన ప్రశ్నలు అడగకుండా మేనేజ్ చేశారని గుసగుస వినిపిస్తోంది. అలాగే జాతీయ మీడియాకు కూడా చిక్కకుండా చై బృందం జాగ్రత్త పడిందట. కానీ నాగచైతన్య ఇకపై ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది. అటు బాలీవుడ్ మీడియాలో ఇంకా చాలా మ్యానేజ్ చేయాలి. ఇలాంటి ప్రశ్నల్ని అక్కడ అడగకుండా ఆపడం అంత సులువేమీ కాదు.. కానీ తప్పదు. మీడియాలో ఇలాంటి ఎఫైర్ గురించి ప్రశ్నలను అడిగేవారిని ఆపడమెలా అన్నదే అసలైన టెక్నిక్.