పరిటాలకు క్లారిటీ ఇవ్వడం లేదా?

తొలిసారి ఎన్నికల బరిలో ఓటమి పాలైన రాజకీయ వారసుల్లో పరిటాల వారసుడు శ్రీరామ్ కూడా ఒకరు. దివంగత పరిటాల రవి వారసుడైన శ్రీరామ్…గత ఎన్నికల్లో రాప్తాడు బరిలో దిగి ఓడిపోయారు. ఒక ఫ్యామిలీకి ఒకటే టికెట్ అని చంద్రబాబు రూల్ పెట్టడంతో పరిటాల సునీతమ్మ పోటీ నుంచి తప్పుకుని, తన తనయుడు శ్రీరామ్ ని రాప్తాడు బరిలో నిలబెట్టారు. కానీ జగన్ వేవ్ లో శ్రీరామ్ ఓటమి పాలయ్యారు.

అయితే ఓడిపోయిన దగ్గర నుంచి శ్రీరామ్ దూకుడుగానే పనిచేస్తున్నారు..మళ్ళీ ఎన్నికల్లో గెలవాలనే కసితో ఉన్నారు. అదే సమయంలో ధర్మవరం నియోజకవర్గం బాధ్యతలు కూడా రావడంతో…రాప్తాడుతో పాటు ధర్మవరంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇలా రెండు చోట్ల పార్టీ కోసం పనిచేస్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో సునీతమ్మ…రాప్తాడులో, శ్రీరామ్…ధర్మవరంలో పోటీ చేస్తారని పరిటాల అనుచరులు ఫిక్స్ అయ్యారు.

 

ఆ రెండూ వద్దు అది మాత్రమే కావాలంటున్న పరిటాల శ్రీరామ్ | The News Qube

శ్రీరామ్ సైతం…ధర్మవరం సీటు తనదే అని, ఎవరికైనా సీటు కేటాయిస్తే రాజకీయాలకే దూరం అవుతానని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే బీజేపీలో ఉన్న వరదాపురం సూరి టీడీపీలోకి వచ్చి ధర్మవరంలో పోటీ చేస్తారని ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది..ఎందుకంటే గతంలో ఆయన టీడీపీలో పనిచేసి వెళ్ళిన నేతే. అయితే ఎవరు వచ్చిన ధర్మవరం సీటు తనదే అని శ్రీరామ్ పనిచేస్తున్నారు.

అయితే అంతా బాగానే ఉంది..కానీ ఇంతవరకు అధికారికంగా మాత్రం ధర్మవరం సీటు విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్లు లేరు. శ్రీరామ్ ని పనిచేయమని చెప్పారు గాని…సీటు మాత్రం ఫిక్స్ చేసినట్లు లేరు. ఆ మధ్య ధర్మవరం సీటు ఫిక్స్ అయిందని కథనాలు వచ్చాయి గాని…అఫిషియల్ గా మాత్రం సీటు ఫిక్స్ కాలేదని తెలుస్తోంది. కానీ సీటు తనదే అనుకుని శ్రీరామ్ పనిచేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏమైనా ట్విస్ట్ ఇస్తే..పరిటాల ఫ్యామిలీ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాలి. మొత్తానికైతే శ్రీరామ్ సీటు విషయంలో ఇంకా క్లారిటీ వచ్చినట్లు కనిపించడం లేదు.

Share post:

Latest