బింబిసార ఈవెంట్ కి ఎన్టీఆర్ ధరించిన టీ షర్టు ధర తెలిస్తే షాక్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా సింప్లిసిటీ గా ఉంటూనే ఎంతోమందిని ఆకర్షిస్తూ ఉంటారు.ఇక ఆయన వాడే వస్తువుల నుంచి ధరించే దుస్తుల వరకు ప్రతి ఒక్కటి కూడా కాస్ట్లీ గా ఉంటుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న బింబిసారా చిత్రానికి సంబంధించి హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జూలై 29వ తేదీన సాయంత్రం 6:00 నుండి చాలా ఘనంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆగస్టు 5వ తేదీన విడుదల కాబోతున్న సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుపుతున్నారు.Jr NTR Wears Costly Sweatshirt In Bimbisara Pre Release Event

ఇకపోతే బింబిసారా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు . అంతేకాదు ఆయన స్పీచ్ తో పాటు ఆయన ధరించిన దుస్తులతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం గమనార్హం. ఇకపోతే NTR బింబీసార ఈవెంట్ కి ధరించిన టీ షర్టు ధర ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. ఇక ఈ టి షర్టు ధర తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.. ఆ టీ షర్టు ధర సుమారుగా రూ. 20,000 నుంచి రూ. 30,000 మధ్యలో ఉంటుందని సమాచారం. ఇక ఈ టి షర్టు ధర తెలియడంతో నెటిజన్లు కూడా ఆశ్చర్యానికి గురి అవుతూ ఎంతైనా సెలబ్రిటీలను అనిపించుకున్నారు అంటూ ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు.Jr. NTR's salute to half-brother Kalyan Ram: No one else can play Bimbisara  | Telugu Movie News - Times of India

ముఖ్యంగా ఎన్టీఆర్ వాడే ప్రతి వస్తువు కూడా చాలా సింపుల్ గా కనిపిస్తూనే అత్యంత ఖరీదైన ధరతో కూడుకొని ఉంటాయి. అందుకే ఆయన ధరించే వాచ్ నుంచి ప్రయాణించే కారు వరకు ప్రతి ఒక్కటి కూడా కాస్ట్లీ అని ఇటీవల వైరల్ అవుతున్న వార్తలు చూస్తే మనకు స్పష్టం అవుతుంది.