హీరో సిద్ధార్థ్ డిప్రెషన్లో వున్నాడా? ఎందుకంత సీరియస్ అవుతున్నాడు?

సిద్ధార్థ్ పరిచయం అక్కర్లేదు. బేసిగ్గా తమిళియన్ అయినప్పటికీ తెలుగులో వచ్చినపేరు అతగాడికి మరెక్కడా రాలేదనే చెప్పుకోవాలి. బొమ్మరిల్లు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు సిద్ధార్ధ్. అంతకుముందు బాయ్స్ అనే సినిమాలో నటించినప్పటికీ అతగాడికి విడిగా పేరు రాలేదు. భాస్కర్ దర్శకత్వంలో నటించిన బొమ్మరిల్లుతోనే సిద్ధార్ధ్ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అయితే ఇతగాడికి ఆ తరువాతి కాలంలో అంత మంచి సినిమాలు పడలేదు. దాంతో కొన్నాళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు.

అయితే అప్పుడప్పుడు మీడియాలో ఏదోఒకటి మాట్లాడుతూ హైలెట్ అవుతూ ఉంటాడు. సోషల్ మీడియాల్లో ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ అప్పుడప్పుడూ రాజకీయాలను కూడా టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఇలా రకరకాల కామెంట్ల విషయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ లోనూ సిద్ధార్థ్ పై ఫిర్యాదులు అందిన సందర్భాలు కూడా అనేకం వున్నాయి. ప్రస్తుతం అతడు అందాల నటి అదితీరావ్ హైదరీతో సహజీవనం సాగిస్తున్నాడని కథనాలొస్తున్నాయి. తాజాగా ఈ ఇద్దరూ ఇటీవల ముంబైలోని ఓ సెలూన్ నుంచి బయటకు వస్తూ కెమెరా కంటికి చిక్కారు.

ఇక అసలు విషయంలోకి వెళితే, వరుస సినిమాలు పరాజయాలు.. రాని సినిమా అవకాశాలు నేపథ్యంలో కొన్ని రూమర్స్ మనోడిమీద సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కెరీర్ పరంగా కాస్త వెనకబడిన సిద్ధూ కాస్త డిప్రెషన్ మెంటైన్ చేస్తున్నాడని వార్తలు వినబడుతున్నాయి. ఒకప్పుడు మీడియా ముందు మర్యాదపూర్వకంగా మాడిన సిద్ధు ఇపుడు మీడియా ఎక్కడ కనబడినా రుసరుసలాడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రకమైన దుందుడుకుతనం వల్లనే అతడు తెలుగు పరిశ్రమలో అవకాశాలు కోల్పోయాడని కూడా అప్పట్లో టాక్ వినిపించింది.