ఫస్ట్ టైం లవ్ మ్యాటర్ రివీల్ చేసిన విజయ్ దేవరకొండ..ఇంట్రెస్టింగ్ డీటైల్స్..!!

టాలీవుడ్ హీరో విజయ్ దేవర కొండ ..ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్ గా మారింది. ఇండస్ట్రీలో ఈయనకు మించిన మగాడు లేడంటున్నారు జనాలు. కొందరు హీరోయిన్స్ ఈ విషయాని డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు. విజయ్ దేవరకొండ కత్తి అని..అలాంటి మగాడే ఈ ఇండస్ట్రీకి అవసరం అని అంటున్నారు. ఈ మధ్యనే హీరోయిన్ సమంత కూడా ఇదే విషయాని కాఫీ విత్ కరణ్ షో లో చెప్పుకొచ్చింది. అంతెందుకు..లైగర్ సినిమా కోసం న్యూడ్ పోస్టర్ వదిలిన సెకన్స్ లోనే విజయ్ హాట్ న్యూడ్ ఫోటో పై ఆల్ మోస్ట్ ఆల్ బడా హీరోయిన్స్ , క్రేజీ హీరోయిన్స్..టాప్ లేచిపోయే కామెంట్స్ చేసారు.

పూజా హెగ్డే, తమన్నా, సమంత, రష్మిక, జాన్వీ కపూర్..వామ్మో ఈ ముద్దుగుమ్మలకు విజయ్ లో ఏం అంత గొప్పగా నచ్చిందో కూడా అర్ధం అవ్వట్లేదు. అంత క్రేజీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు విజయ్. ఇక రీసెంట్ గా ఈయన కాఫీ విత్ కరణ్ షోకి గెస్ట్ గా వచ్చారు. ఈయన తో పాటు అనన్య పాండే కూడా వచ్చింది. ఇద్దరు యంగ్ స్టర్స్ ..అది కూడా హాట్ క్రేజీ ఫ్యాన్స్ ఉన్న సెలబ్స్ ..ఇక హోస్ట్ కరణ్ ఊరుకుంటాడా..దోరికిన వరకు కంటెంట్ దోచుకునేయడు. అదే జరిగింది షోలో..బోల్డ్ కంటెంట్ తో..సెక్స్ క్వశ్చన్స్ తో విజయ్, అనన్య గుట్టు రట్టు చేశారు.

ఈ క్రమంలోనే..విజయ్ ను తన్ గర్ల్ ఫ్రెండ్ గురించి అడిగాడు కరణ్ జోహర్. అంతే విజయ్ ఇచ్చిన ఆన్సర్ కు కరణ్ మైండ్ బ్లాక్ అయ్యింది. విజయ్ మాట్లాడుతూ..”నేను మ్యారేజ్ చేసుకున్నాక ఈ విషయం అందరికి చెప్తాను. నన్ను ఇష్టపడే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. నేను, ఇప్పుడు నా లవ్ గురించి చెప్పి వాళ్ళని బాధపెట్టను. ఎందుకంటే.. నన్ను ఇష్టపడి గోడలపై నా పోస్టర్లు అతికించుకున్న అభిమానులు చాలా మందే ఉన్నారు. ఫోన్‌ వాల్‌ పేపర్‌ మీద కూడా నా ఫొటోనే సేవ్ చేసుకున్న గర్ల్స్ కూడా ఉన్నారు.

ఇప్పుడు నేను నోరు విప్పి వారి మనోభావాలను కించపరచాలి అనుకోవట్లేదు . నా ప్రేమ గురించి చెప్పి వారి మనసు ముక్కలు చేయాలి అనుకోవడం లేదు” అంటూ బదులిచ్చాడు. అంటే విజయ్ కి గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆయన ఓ అమ్మాయితో కమిట్ అయ్యి ఉన్నాడు అనేగా అర్ధం..అంటూ నెటిజన్స్ విజయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవ్వరా అంటూ గెస్ చేస్తూ రకరకాలా హీరోయిన్స్ పేర్లను కామెంట్స్ చేస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ లవ్ చేస్తున్న ఆ అమ్మాయి ఎవ్వరు అని మీరు అనుకుంటున్నారు..?