NTR – హరికృష్ణ మధ్య కొన్నాళ్ళు మాటలు లేకపోవడానికి కారణం ఇదే?

స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఎక్కడో కృష్ణ జిల్లా నిమ్మకూరు గ్రామానికి చెందినటువంటి ఓ వ్యక్తి పాల వ్యాపారం నుండి కెరీర్ మొదలు పెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వైనాన్ని కొనియాడకుండా ఉండలేము. తెలుగు చిత్ర సీమలో ఎన్నో జానపద, పౌరాణిక , సాంఘిక చిత్రాలలో నటించి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఆయన ఏదైనా చేయాలి అనుకుంటే.. ఎవరు అవునన్నా, కాదన్నా తప్పకుండా అదే చేసి తీరేవారట. అందుకు ఉదాహరణగా రాజకీయ రంగ ప్రవేశం అని చెప్పవచ్చు.

ఎన్టీఆర్ ఎవ్వరి మాటా లెక్కచేసేవారు కాదు?

ఈ విషయంలో సినీ రంగంలో ఎంతో మంది అతనికి కాదన్నా, ఎవరి మాటలను ఆయన పట్టించుకోకుండా చాలా జాగ్రత్తగా రాజకీయరంగంలోకి అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రిగా తనను తాను నిరూపించుకున్న తీరు నభూతో న భవిష్యతి. ఇక కొన్ని కొన్ని విషయాలలో మాత్రం ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావును ఎక్కువగా సంప్రదించేవారట. ఇదిలా ఉండగా ఒకానొక సమయంలో తనకు నచ్చని పని కొడుకు చేస్తున్నాడు అన్న కారణంగా NTR హరికృష్ణతో ఏకంగా 2 సంవత్సరాలు వరకు మాట్లాడలేదట.

ఇదే అసలు కారణం?

దానికి గల కారణమేమిటో ఒకసారి చూద్దాం. సినిమాలలోకి వచ్చిన కొత్తలో హరికృష్ణ సొంతంగా సినిమా హాలు కట్టుకుంటానని చెప్పారట. చాలా రోజులు ఇంట్లో ఈ విషయంపైన డిస్కషన్ జరిగిన తరువాత పెట్టుబడి పెట్టండి అని NTRను సతాయించారట. ఈ విషయంలో ఎన్టీఆర్ అక్కినేనిని సంప్రదించారట. అయితే దానికి అక్కినేని నో చెప్పారట. అంతేకాదు ఆయన సినిమా హాలు వద్దు గాని దాని ప్లేసులో స్టూడియో పెట్టుకుంటే నిత్యం వ్యాపారం జరుగుతుందని సలహా ఇచ్చారట. కానీ హరికృష్ణ మాత్రం స్టూడియో పెట్టడానికి ఇష్టపడలేదు. దీంతో తన తండ్రితో 2 సంవత్సరాల పాటు మాట్లాడలేదట.!