జబర్దస్త్: మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి చమ్మక్ చంద్ర అలా అన్నాడా?

శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంటే ఎవరికీ అర్ధం కాదేమో గాని.. అరుంధతి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నా, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నా, జబర్దస్త్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నా అందరికీ ఇట్టే అర్ధం అయిపోతుంది. అవును… అంకుశం, ఆవేశం, ఆహుతి, అమ్మోరు, అహం, అంజి, అరుంధతి అనే సంచలన సినిమాలు తీసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి యెంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అంతవరకూ మూసధోరణిలో సినిమాలు పోతున్న వేళ, ఓ డిఫరెంట్ జోనర్స్ చేసి హిట్లు మీద హిట్లు కొట్టాడు. మరీ ముఖ్యంగా గ్రాఫిక్స్ విషయంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి అస్సలు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు.

మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి?

అరుంధతి సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా తరువాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి సినిమాలకు బ్రేక్ వేసాడు. మల్లెమాల అనే సంస్థను స్థాపించి.. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, వెబ్ పోర్టల్స్, సీరియల్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ షోస్ బాగా సక్సెస్ అవ్వడంతో శ్యామ్ ప్రసాద్ రెడ్డి మంచి బిజీ అయ్యారు. దాంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారని టాలీవుడ్ వర్గాలలో చర్చ నడుస్తోంది.

జబర్దస్త్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి?

ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో నిర్మాత అనే సంగతి అందరికీ విదితమే. దాని ద్వారా ఎంతోమంది కమెడియన్లు గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు. ముఖ్యంగా ఈయన ఎక్కువగా లేడీస్ స్కిట్లనే చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. అయితే అతను తాజాగా ఒక ప్రముఖ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. శ్యామ్ ప్రసాద్ రెడ్డి పై పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. జబర్దస్త్ అనేది ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చింది అని.. వాటి మీద ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడటం మంచిది కాదు అని, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అనేవారు లేకపోతే మాలాంటివారు లేనేలేరు అని కొనియాడారు.

Share post:

Latest