బాలయ్య బాబు తాజా గెటప్ చూశారా? హాలీవుడ్ హీరోని తలదన్నేలా వుందే!

నందమూరి అందగాడు బాలకృష్ణ గురించి ప్రస్తావన అవసరంలేదు. అఖండ భారీ హిట్ కావడంతో బాలయ్య మంచి జోష్ లో వున్నాడు. అదే జోష్ లో మరిన్ని సినిమాలను లైన్లో పెట్టాడు. తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసినదే. ఆ సినిమా లో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడని టాక్. ఆ గెటప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కాగా, హీరోగా బాలయ్య జోరుకు యంగ్ హీరోలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. బాలయ్య గెటప్.. ఆయన డైలాగ్ డెలవరీకి అంతా ఫిదా అవుతున్నారు.

వివరాల్లోకి వెళితే, తాజాగా బాలయ్య విమానాశ్రయంలో కెమెరాల కంటకి చిక్కారట. దాంతో స్పాట్లో చిక్కిన ఫోటోలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. బాలయ్య ను ఒక్కసారిగా ఇరవై ఏళ్ల వయసు తక్కువ అయినట్లుగా చూసినట్లు జనాలు చర్చించుకుంటున్నారు. బాలయ్య బాబును ఇలా ఎప్పుడు కూడా చూడలేదు అంటూ నందమూరి అభిమానులు సంబరాలలో మునిగితేలుతున్నారు. కొందరు సోషల్ మీడియాలో ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తూ ఉన్నారు. మరో వైపు బాలయ్య ఫోటోలతో ఇలా మీరు ఎప్పుడైనా బాలయ్య ను చూశారా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

అవును.. బాలయ్య లుక్ కు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. కావాలంటే ఇక్కడ ఫోటోలు చూడండి. ఇలా రెండు విభిన్నమైన పాత్రలలో బాలయ్య అలరించనున్నారట. ఇంత యంగ్ గా చేసిన మేకప్ ఆర్టిస్ట్ కు మరియు ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ కు హ్యాట్సాఫ్ అంటూ నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలయ్య తాజా సినిమా షూటింగ్ విషయానికి వస్తే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చివరి దశకు వచ్చింది. మరో వైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా ను చేసేందుకు ఇప్పటికే డేట్లు ఇచ్చాడు. ఈ ఏడాది చివర్లోనే సినిమా ను ప్రారంభం చేసే అవకాశం ఉంది.

Share post:

Latest