ఒక‌ప్ప‌టి హీరోయిన్ సంఘ‌వికి తెర‌వెన‌క సీక్రెట్స్ ఇన్ని ఉన్నాయా..!!

సినీ ఇండస్ట్రీలో సినీ తార జీవితాలు ఒక తెరిచిన పుస్తకం లాంటివని చెప్పవచ్చు. ఇక వీరిపై సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉంటాయి .అయినప్పటికీ వీరి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్క ప్రేక్షకులు అభిమానులు సైతం ఎంతో ఆతృతగా ఉంటారు. ఇండస్ట్రీలో ఎక్కువమంది హీరో, హీరోయిన్లు సైతం రెండు మూడు వివాహాలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే వీటిలో కొన్ని మాత్రమే తెలుస్తూ ఉంటాయి. అయితే వారి యొక్క విషయాలను తెలుపకుండా ఉండేందుకు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఎలాగోలాగా అభిమానులకు తెలుస్తూ ఉంటాయి . ఇప్పుడు అలాంటి సంఘటన హీరోయిన్ సంఘవికి ఎదురైంది వాటి గురించి చూద్దాం.Telugu Senior Heroine Sangavi Became A Mother In 42 - Sakshiతెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వంటి భాషలలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సంఘవి. ఈమె కర్ణాటకలోని మైసూర్ కు చెందినది. ఈమె అసలు పేరు కావ్య. ఈమె తండ్రి ఒక డాక్టర్. ఇక ఆమెను కూడా డాక్టర్ చేయాలని తన తండ్రి అనే వారట. కానీ సంఘవి డ్యాన్స్ నేర్చుకోవడం కోసం డాన్స్ స్కూల్ కి పంపగా అక్కడ స్టెప్పులను చూసి డైరెక్టర్ సెల్వ ఆమెను హీరోయిన్గా చేయడం జరిగిందట. దాదాపుగా సినీ ఇండస్ట్రీలో 23 సంవత్సరాల పాటు ఈమె హీరోయిన్ గానే కొనసాగింది.Actress Sanghavi finally ties the knot with an IT professional

శ్రీకాంత్ నటించిన తాజ్ మహల్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సూర్యవంశం సినిమా మంచి పేరును తెచ్చి పెట్టింది. కెరియర్ పరంగా దూసుకుపోతున్న సమయంలో శివయ్య సినిమా దర్శకుడు సురేష్ వర్మతో ఈమె ప్రేమాయణం కొనసాగించింది. దీంతో వీరిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది. కానీ కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోయారట. ఆ తర్వాత బెంగళూరులో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను వివాహం చేసుకున్నది సంఘవి. 42 ఏళ్ల వయసులో కూడా ఈమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తన రెండవ వివాహాన్ని మాత్రం ఎవరికీ చెప్పలేదట. కానీ ఈ వివాహమే చాలా రోజులకి అవ్వడంతో తాజా గా ఈమె ఆ విషయాలను తెలియజేసినట్లుగా తెలుస్తోంది.

Share post:

Latest