“అదే జరిగితే మాకు విడాకులే”..ప్రియాంకా చోప్రా సంచలన వ్యాఖ్యలు..!!

అసలే ఇండస్ట్రీలో చూడచక్కని జంటలు అందరు విడాకులు తీసుకుని..సపరేటు గా జీవించడానికి సిద్ధపడుతున్నారు ..ఏంటి రా ఈ కర్మ అనుకుంటుంటే.. రీసెంట్ గా అభిమానుల గుండెలు బద్ధలు అయ్యే న్యూస్ చెప్పుకొచ్చింది గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా. యస్..ప్రియాంకా నోటి నుండి విడాకుల మాట వినిపించింది. లైవ్ లోనే ఆమె తమ విడాకుల ప్రస్తావన తీసుకురావడం..లోకల్ మీడియాలోనే కాదు..ఇంటర్నెషనల్ మీడియాలోను హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

మనకు తెలిసిందే ప్రియాంకా చోప్రా ఇప్పుడు గ్లోబల్ బ్యూటీ అయిపోయింది. బాలీవుడ్ లో చిన్న స్దాయి హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ఈ హాట్ బ్యూటీ..ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే మంచి మంచి సినిమాలు పట్టేసి.. తన కంటే ముందు ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్స్ కంటే కూడా ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. అలా మెల్లగా మెల్లగా ఇప్పుడు హాలీవుడ్ స్దాయిలో సినిమాలు చేస్తూ..శభాష్ అనిపించుకుంటుంది.

అయితే, ప్రియాంకా తన కంటే వయసులో పెద్దవాడైన నిక్ జోనస్ ను పెళ్ళి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది. ఈ మధ్యనే సరోగసి పద్ధతి ద్వారా తల్లై మరో షాక్ ఇచ్చింది. కాగా, ఇప్పుడు విడాకుల ప్రస్తావన తీసుకొచ్చి..మీడియా లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ ఇంటర్వ్యుల్లో ఆమె మాట్లాడుతూ..”నా పరసనల్ విషయాలను బయటపెట్టను ఎందుకా అని చాలా మంది అడుగుతుంటారు. దానికి కారణం ..నేను నమ్మే సెంటిమెంట్. మా జంట పై కన్ను దిష్టి తగిలితే..మేము కూడా విడిపోతాము ఏమో అన్న భయంతోనే నా పరసనల్ విషయాలను బయటపెట్టను..నేను పంజాబీ అమ్మాయిని కావడంతో ఇలాంటివి ఎక్కువుగా నమ్ముతుంటాను”అని చెప్పుకొచ్చింది.

Share post:

Popular