నోరు కంట్రోల్ లో పెట్టుకో..సుధీర్ ను బాధపెట్టిన నాగబాబు మాటలు..?

సుడిగాలి సుధీర్ ..ఈ పేరు కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తనలో ఉన్న టాలెంట్ ను నలుగురికి చూయించడానికి ఎన్నో కష్టాలుపడి..ఫైనల్లీ జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా..ఇప్పుడు ఈస్దాయి కి వచ్చాడు. కేవలం సుధీర్ నే కాదు..కష్టాల్లో ఉన్న ఎంతో మంది టాలెంటెడ్ కామెడీయన్స్ కు అన్నం పెట్టింది జబర్ధస్త్ నే.

- Advertisement -

అలాంటి జబర్ధస్త్ ను ఇప్పుడు ఒక్కోక్కరుగా అందరు విడిచి వెళ్ళిపోతున్నారు. మొదట నాగబాబుతో మొదలైన ఈ ప్రాసెస్..ఫైనల్లీ అనసూయా వరకు చేరుకున్నట్లు తెలుస్తుంది. కాగా, అస్సలు ఇలా జబర్ధస్త్ కామెడీయన్స్ అందరు ఒక్కరు తరువాత ఒకరు ఇలా షో ని విడిచి వెళ్ళిపోవడానికి కారణం మెగా బ్రదర్ నాగబాబు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది.

అయితే, రీసెంట్ గా మాటీవీలో “పార్టీ లేదా పుష్ప” అంటూ ఓ ప్రోగ్రామ్ ను కండెక్ట్ చేసారు. ఈ ఈవెంట్ లో నాగబాబుతో పాటు సుడిగాలి సుధీర్ పాల్గొన్నాడు. ఆయన షో ని హోస్ట్ చేస్తూ .. ఈవెంట్ లో భాగంగా నాగబాబుకు సుధీర్ వెల్కమ్ చెప్పారు. సుధీర్ వెల్కమ్ కి నాగబాబు భిన్నంగా స్పందించారు. “ఎవ్వరికి చెప్పుతున్నవ్ రా వెల్కమ్” అంటూ స్ట్రాంగ్ పంచ్ వేసాడు. అంతేకాదు, సుధీర్ తనదైన స్టైల్ లో కామెడీ చేస్తున్న క్రమంలో..”ఇలాంటివి చేయడం కోసమే అక్కడి నుండి ఇక్కడి వచ్చావా రా..?” అంటూ మరో ఘాటు పంచ్ డైలాగ్ విసిరారు. దీంతో నాగబాబు మాటలను ఉద్దేశిస్తూ సుధీర్ ఫ్యాన్స్ ఆయన పై మండిపడుతున్నారు. “నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాయ్..నీతులు చెప్పే నువ్వు ..ముందు నీ పని చూసుకో ..ముందు నోరు కంట్రోల్ లో పెట్టుకో..మా సూధీర్ అన్న జోలికి రాకు..” అంటూ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు.

Share post:

Popular