లోకేష్‌కు ఎన్టీఆర్ టెన్ష‌న్ త‌ప్పిందా…!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. నారా లోకేష్‌కు ప్ర‌ధాన సంక‌టం త‌ప్పిందా? ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఏ విష‌యంపై అయితే.. ఇబ్బంది ఉంటుంద‌ని భావించారో.. అది దాదాపు పోయిందా? అంటే.. ఔన‌నే అం టున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. లోకేష్‌కు ప్ర‌ధానంగా ప్ర‌సంగించ‌డం రాద‌నే వాద‌న ఉంది. ఆయ న నాలుగు మాట‌లు మాట్లాడే.. రెండు త‌ప్పులు వ‌స్తాయ‌నే పేరు ఉంది. అయితే.. మ‌హానాడుకు ముందు నుంచి కూడా ఆయ‌న భారీగా క‌స‌ర‌త్తు చేశారు..

ఎక్క‌డా త‌ప్పులు దొర్ల‌కుండా.. త‌న ప్రసంగాల‌ను రాటు దేల్చారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు త‌న ప్రసంగాల‌కు వంక‌లు పెట్టిన వారు కూడా.. వెతుకుదామ‌న్నా..క‌నిపించ‌ని విధంగా లోకేష్ త‌న ప్ర‌సంగాల‌ను ప‌దును పెంచారు. ఇది బాగానే వ‌ర్క‌వుట్ అయింది. ఇక‌, రెండోది.. త్వ‌ర‌లోనే పాద‌యాత్ర‌కు రెడీ కావడం. ఈ రా ష్ట్రంలో పాద‌యాత్ర చేసిన నాయ‌కులు స‌క్సెస్ కానివారంటూ.. లేరు. గ‌తంలో వైఎస్‌తో ప్రారంభమైన పాదయాత్ర ప‌రంప‌ర‌.. త‌ర్వాత‌.. టీడీపీ, వైసీపీ వ‌ర‌కు సాగింది.

ఎవ‌రు పాద‌యాత్ర చేసినా.. ప్ర‌జ‌లు దీవించారు. వైఎస్ అధికారంలోకి వ‌చ్చారు. త‌ర్వాత‌.. వ‌స్తున్న మీ కోసం..యాత్ర చేసిన చంద్ర‌బాబును ప్ర‌జ‌లు దీవించారు.. త‌ర్వాత‌.. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర చేసిన జ‌గ‌న్‌కు కూడా అధికారం క‌ట్ట‌బెట్టారు.. సో.. ఇప్పుడు.. లోక‌ష్ చేసే యాత్ర‌కు కూడా ఇదే త‌ర‌హా ఫాలోయింగ్ ప్ర‌జ‌ల అభిమానం ఖాయ‌మ‌ని అంటున్నారు. దీంతో లోకేష్ పాద‌యాత్ర‌పై పార్టీలో జోష్ పెరుగుతోంది. మ‌రోవైపు నిన్న మొన్న‌టివ‌ర‌కు ఒక సంచ‌ల‌న నినాదం వినిపించేది.

అదే జూనియ‌ర్ ఎన్టీఆర్ నామ‌స్మ‌ర‌ణ‌. ఆయ‌న‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించేయాల‌ని కూడా కొన్ని సంద‌ర్భాల్లో పార్టీలో డిమాండ్లు వ‌చ్చాయి. అయితే… తాజాగా జ‌రిగిన మ‌హానాడులో ఇలాంటి త‌ర‌హా.. ప్ర‌క‌ట‌న కానీ.. ఎలాంటిడిమాండ్ కానీ రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనికి నారా లోకేష్ అనుస‌రించిన వ్యూహ‌మే కార‌ణ‌మ‌ని అంటున్నారు. అంద‌రినీ క‌లుపుకొని పోతున్నారు. అదే స‌మ‌యంలో అంద‌రికీ అందుబాటులో ఉంటున్నారు. దీంతో అన్ని ర‌కాలుగా లోకేష్ ఫ్యూచ‌ర్ నాయ‌కుడు అనే మాట వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Share post:

Popular