సోనియా తో మూడో పెళ్లి..ఎట్టకేలకు ఓపెన్ అప్ అయిన SP చరణ్ ..?

సినీ ఇండస్ట్రీలో గాన గాంధర్వుడు, దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మధురమైన గొంతుతో..ఎన్నో వేల అధ్బుతమైన పాటలతో ఎంతోమందిని అలరించారు. ఆయన పాటకు ఫిదా అవ్వని వాళ్లంటు ఉండరు. ఎటువంటి పాట నైన తన గొంతుతో మాయ చేసే బాలసుబ్రమణ్యం..మాయదారి కరోనా మహమ్మారి సోకి..మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

- Advertisement -

అయితే, ఆయన వారసుడి ఇండస్ట్రీకి పరిచయమైన SP చరణ్..తండ్రి లేని లోటు ను భర్తి చేస్తున్నారు. బాల సుబ్రమణ్యం రేంజ్ కాకపోయినా..చరణ్ కూడా చక్కగా పాటలు పాడుతారు. ఇప్పటికే మంచి మంచి సినిమాలో హిట్ పాటలు పాడారు. SP చరణ్ గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునేందుకు తపిస్తూ.. వరుస షోలు నిర్వహిస్తూ, పాటలు పాడుతూ అలరిస్తున్నారు. SP చరణ్ వృతి పరంగా ఎప్పుడు సక్సెస్ బాటలోనే వెళ్తున్నారు. అయితే, గత కొన్ని గంటల నుండి..ఆయన కు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

కోలీవుడ్ హీరోయిన్ సోనియా అగర్వాల్ తో క్లోజ్ గా ఉన్న ఫోటో ని షేర్ చేస్తూ..”ఏదో కొత్తగా జరగబోతుంది’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇంకేముంది..ఆయన పోస్ట్ చేసిన కాసేపట్లోనే ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో చరణ్, సోనియాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటు వార్తలు మారుమ్రోగిపోయాయి. అంతేనా, కొందరు అయితే, ఏకంగా చూడచక్కని జంట..గాడ్ బ్లెస్ యూ అంటూ కామెంట్స్ కూడా చేశేశారు. అయితే, మరి కొద్ది సేపటికే ఇంకో ఫోటో పోస్ట్ చేసి.. తాను నటిస్తున్న కొత్త వెబ్ సిరీస్ అంటూ అసలు విషయం ఓపెన్ అప్ అయ్యాడు. అంతే సోనియాను పబ్లిసిటీ కోసం వాడుకున్నారనమాట. కాగా గత కొద్ది రోజులుగా సోనియా అగర్వాల్‌ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్‌ పెట్టిన పోస్ట్‌ చర్చనీయాంశంగా మారింది.ఎస్పీ బాలసుబ్రమణ్యం లాంటి గొప్ప సింగర్ కడుపున పుట్టిన చరణ్ ఇలా పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేశాడంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నాడు. ఎస్పీ చరణ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే.

Share post:

Popular