శ్రీవల్లి ఆయన సిస్టర్..‘పుష్ప2’లో షాకింగ్ ట్వీస్ట్ పెట్టిన సుకుమార్..?

లెక్కల మాస్టర్ సుకుమార్ ..టాలీవుడ్ స్టైలీష్ స్టార్ హీరో అల్లు అర్జున కాంబో లో వచ్చిన సినిమా “పుష్ప”. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి పాజిటీవ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫస్ట్ టైం ఫుల్ లెంత్ లో బన్నీ మాస్ రోల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం బన్నీ కష్ట పడిన తీరు.. ఆ స్లాంగ్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. సినిమా మొత్తనికి బన్నీ వన్ మ్యాన్ ఆర్మీ అయిపోయాడు.

- Advertisement -

17 డిసెంబరు 2021 లో రిలీజ్ అయిన ఈ సినిమా బన్ని కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్ నెలకొల్పింది. ఈ సినిమా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ..హీరోయిన్ గా నటించింది. అయితే పుష్ప 1 లో శ్రీవల్లి కు పుష్ప రాజ్ తో పెళ్లైన్నట్లు చూయిస్తారు. భన్వర్ సింగ్ షేకావత్ తో గొడవ పెట్టుకున్న బన్నీ..పుష్ప సెకండ్ పార్ట్ లో ఆయనను తన రూలింగ్ తో ఎలా ముప్పుతిప్పలు పెట్టాడు అన్నదే అసలు కధ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

కాగా, తాజాగా సుకుమార్ తాను రాసుకున్న స్క్రిప్ట్ మారుస్తూ..కధలో షాకింగ్ ట్వీస్ట్ పెట్టారట. నిజానికి శ్రీవల్లి లారీ డ్రైవర్ కూతురు కాదట. ఆమె ఓ పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి.. ఓ ప్రమాదంలో ఆమె అడవుల్లో పడిపోతుందట ..కుటుంబ సభ్యులు ఆమె చనిపోయిందనుకుంటారు. సీన్ కట్ చేస్తే..గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేసే క్రమంలో ఆ లారీ డ్రైవర్ కు శ్రీవల్లి దొరుకుతుంది. అప్పటికే పెళ్ళై చాలా ఏళ్ళు పిల్లలు లేకుండా బాధపడుతున్న ఆయన శ్రీవల్లిగా తన తల్లి పేరు పెట్టుకుని రష్మీక ను పెంచుకుంటారు. అయితే, పార్ట్ 2 శ్రీవల్లి ప్రెగ్నెంట్ అవ్వడం..ఆ టైంలో ఎమర్జెన్సీ కండీషన్ లో భన్వర్ సింగ్ తో ఉన్న రక్త సంబంధం బయటపడుతుందట. ఇక అప్పుడు కధలో అస్సలు సిసలైన మజా ఉంటుందని తెలుస్తుంది. ఏది ఏమైన పార్ట్ 2 లో చాలా ట్వీస్ట్ లే పెట్టాడు సుక్కు..మరి చూడాలి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో..ఎలాంటి విజయం అందుకుంటుందో..?

Share post:

Popular