అయ్యయ్యో..ఎంత దారుణం..ప్రభాస్ చెల్లికే ఇలా జరిగిందేంటి ..!!

ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువుగా చేస్తున్న పని..ఆన్ లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడం. మనకి ఇంట్లో వంట చేసుకునే టైం లేనప్పుడు..ఉన్నా కానీ, బయట నుండి రుచిగా ఏదైన తినాలి అనిపించిన..లేక సడెన్ గా గెస్ట్ లు వచ్చిన..వెంటనే , అందరు మొబైల్ తీసి జోమాటో , స్వీగీ నుండి ఏదైన ఫుడ్ ఆర్డర్ పెట్టేసి..కాళ్ళు మీద కాళ్ళ వేసుకుని ఏంచక్క లాగించేస్తాం.

అయితే, ఈ మధ్య కొన్ని ఫుడ్ డెలివరి కంపెనీస్ చాలా దారుణంగా బీహేవ్ చేస్తున్నాయి. మనం ఆర్శర్ ఇచ్చిన ఫుడ్ ఒక్కటైతే..వాళ్ళు తెచ్చేది మరోకటి. పైగా మనం ఆర్డర్ ఇచ్చిన చాలా టైం తరువాత మనకి డెలివరి చేస్తారు. ఈలోపు మనమే ఇంట్లో వండుకుని తినేయచ్చు. అంత టైం తీసుకుంటారు. సరే, ఇవ్వని పక్కన పెడితే..కస్టమర్స్ తో కొందరు డెలివరీ బాయ్స్ మాట్లాడే పద్ధతి చూస్తే ఒళ్ళు మండిపోతుంది. ఏదో వాడి డబ్బులతో మనకి ఫుడ్ తెచ్చిన్నట్లు ఫీల్ అయిపోతుంటాడు.

ఈ మధ్య కాలంలో ఇలా చాలా సంఘటనలు జరిగాయి. మనకే కాదు స్టార్ సెలబ్రిటీలకు కూడా ఇలాంటి పరిస్ధితులే ఎదురు అవుతున్నాయి. రీసెంట్ గా పాన్ ఇండియా హీరో ప్రభాస్ చెల్లికి..ఇదే సంఘటన ఎదురైంది. పాపం ఆకలి వేసి స్విగీలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే..ఆ డెలివరీ బాయ్ వచ్చిందే లేటు కాకుండా..వేరే ఫుడ్ ని తీసుకొచ్చారట. అడిగితే ..కేర్ లెస్ సమాధానాలు ఇస్తున్నారట. దీంతో విసుకు చెందిన ప్రభాస్ సోదరి ప్రసీద..స్వీగి యాప్ ను డిలిట్ చేసేసిందట. అంతేనా, తనకు ఎదురైన ఈ చేదు అనుభవం గురించి అందరికి చెప్పి..తనలా ఎవ్వరు బాధపడకుండా..జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పుకొచ్చింది. కాగా, ప్రసీదను రాధే శ్యామ్ సినిమాతో ప్రోడ్యూసర్ గా మారింది. విదేశాల్లో చదువుకున్న ప్రసీద గత కొన్నేళ్ళుగా ఆమె యూవీ క్రియేషన్స్‌లో చిత్ర నిర్మాణానికి చెందిన వ్యవహారాలను చూసుకుంటోంది.

Share post:

Popular