ఒక్క దెబ్బ తో వాళ్ల నోర్లు మూయించిన ప్రభాస్..నువ్వు సూపర్ డార్లింగ్ ..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి విషయం ఆలోచించని ఈ హీరో..సినిమాల విషయంలో మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే చేతిలో బోలెడు ప్రాజెక్ట్లు పెట్టుకుని మరో మూడు నాలుగేళ్లు ఒక్క కాల్ షీటు కూడా ఖాళీగా లేకుండా బిజీగా ఉన్న ప్రభాస్..మళ్లీ కొత్త సినిమాలకు సైన్ చేస్తుండటం గమనార్హం. ప్రజెంట్ ప్రభాస్ నాగ్ అశ్వీన్ డైరెక్షన్ లో “ప్రాజెక్ట్ కె”..ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాబోతున్న “సలార్” షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.

కాగా, ఈ సినిమా లు కంప్లీట్ అవ్వగానే మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా..సందీప్ వంగా డైరెక్షన్ లో మరో సినిమా..కి కమిట్ అయ్యిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆయన లుక్స్ కు సంబంధించిన వార్తలు ఎక్కువ గా వైరల్ అవుతున్నాయి. ఆయన ముఖం వాడిపోయిన్నట్లు ఉందని, వెయిట్ వచ్చేశాడని..నల్లగా మారిపోయాడని..అస్సలు హీరో లుక్స్ లా నే అనిపించట్లేదు అని..తెగ ట్రోల్ చేశారు కొందరు జనాలు.

అలాంటి వాళ్లకి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చాడు ప్రభాస్. రీసెంట్ గా ఆది పురుష్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ ఇంటికి వెళ్ళిన ప్రభాస్..మీడియా కంట కనపడ్డాడు. ఈ క్రమంలో ప్రభాస్‌ను అక్కడున్న ఫోటో గ్రాఫర్లు క్లిక్‌మనిపించేసారు.ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రభాస్ స్లిమ్ గా మారిపోయి..ఫిట్ గా తయారైయ్యాడు. చాలా హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నాడు. మొత్తానికి ప్రభాస్ మాత్రం తన కొత్త లుక్‌తో అందరినీ కట్టిపడేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు.

Share post:

Popular