ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్..ఇండస్ట్రీలో కొత్త వార్..?

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో గ్రూప్ లు ఎక్కువ అయ్యాయి. ఎవ్వరికి వారు కొందరు హీరోలను డివైడ్ చేసుకుని..వాళ్లతోనే సినిమాలు తెరకెక్కిస్తూ..ఇండస్ట్రీలో కొత్త పద్ధతులు ఫాలో అవుతున్నారు. కాగా, రీసెంట్ గా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కి ఓ టాప్ డైరెక్టర్ వార్నింగ్ ఇచ్చిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఇండస్ట్రీలో కొత్త వార్ మొదలైన్నట్లు తెలుస్తుంది.

నిజానికి ఈ ఇద్దరు జాన్ జిగిడి దోస్త్లు..గతంలో చాలా సినిమాలకు కలిసి పని చేశారట. కానీ, ఈ మధ్య కాలంలో ఆ మ్యూజిక్ డైరెక్టర్ హెడ్ వెయిట్ పెరిగి..స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఆయన ట్యూన్స్ ఇస్తూ..తన దగ్గరైకి వచ్చిన మిగతా హీరోల(ఒకప్పుడు స్టార్స్..ఇప్పుడు ఫాం తగ్గిన హీరోలు) సినిమాలకి మాత్రం తన దగ్గర ఉండే అసిస్టెంట్ ల తో మ్యూజిక్ కంపోజ్ చేయిస్తున్నాడట. గతంలో ఇలాంటి నిందలు చాలానే మోశారు ఆయన.

అయితే, రీసెంట్ గా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ను నమ్మీ ఓ ప్రాజెక్ట్ అప్ప చెప్పితే.. ఆయన బీహేవియర్ పట్ల అసహనం వ్యక్తం చేశాడట డైరెక్టర్. సినిమా సీన్స్ కి తగ్గట్లు చేయమన్న మ్యూజిక్ ని ట్రాజిడి చేస్తూ..దారుణమైన విధంగా ట్యూన్స్ కంపోజ్ చేశారట. ఇవి విన్న డైరెక్టర్ ..మ్యూజిక్ లో మార్పులు చేయమని చెప్పినా..పట్టించుకోకపోగా..డైరెక్టర్ తో రూడ్ గా మాట్లాడి..ఆయన ఫ్లాప్ తాలుకా సినిమాల గురించి ప్రస్తావించిన్నట్లు తెలుస్తుంది. దీంతో డైరెక్టర్ కి..మ్యూజిక్ డైరెక్టర్ కి మధ్య పెద్ద గొడవ జరిగిన్నట్లు ఇండస్ట్రీలో ఓ రూమర్ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది.