బిగ్ బ్రేకింగ్‌: మ‌హేష్ – త్రివిక్ర‌మ్ రిలీజ్ డేట్ ఇదే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్నా ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ అయితే స్టార్ట్ కాలేదు. పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకున్నారు. థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. అయితే ఇంకా ప‌ట్టాలు ఎక్క‌లేదు. అయితే ఈ సినిమా గురించి రెండు అదిరిపోయే అప్‌డేట్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ప్రిన్స్ మ‌హేష్‌బాబు బ‌ర్త్ డే కానుక‌గా ఆగ‌స్టు 9న రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -

ఇక ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జూలై చివ‌రి వారం నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై కూడా అప్‌డేట్ వ‌చ్చేసింది. 2023 జనవరి 12వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారట. చాలా స్పీడ్ గా ఈ సినిమాని ఫినిష్ చేయాలని.. త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. నాలుగు నెల‌ల్లోనే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసే ప్లాన్ చేస్తున్నారు.

ముందుగా ఓ సాంగ్‌తో సినిమా షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని.. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేయనున్న ఈ సాంగ్ కోసం ఓ ప్రత్యేక సెట్ కూడా నిర్మిస్తున్నారు. 2010లో వ‌చ్చిన ఖ‌లేజా త‌ర్వాత‌… అంటే 12 ఏళ్ల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇటు త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ తో అరవింద సమేత – అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో వంటి వరుస హిట్ల‌తో ఫుల్ ఫామ్‌లో ఉండ‌డంతో ఈ సారి మ‌హేష్‌తో ప‌క్కా హిట్ అంటున్నారు.

Share post:

Popular