కొంప ముంచేసిన నయన్ నిర్ణయం..తెలిసి తెలిసి ఇంత పెద్ద తప్పు ఎలా చేసిందబ్బా..?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన మొదట్లో చాలా చబ్బీగా సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసుకుంటూ..చేతికి వచ్చిన పాత్రలు చేసిన ఈ అమ్మడు..ఆ తరువాత నెమ్మది గా తన యాక్టింగ్ స్టైల్ ని మార్చుకుంటూ.. స్లీం గా మారి కధల చూసింగ్ లో ఢిఫరెంట్ స్ట్రాటజీ మార్చి..సూపర్ లేడీ బాస్ గా మారిపోయింది. ఇప్పుడు నయనతార పోజీషన్ ఎలా ఉందంటే..సౌత్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నయన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

ఈ స్దాయికి రావడానికి ఆమె ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎంతో కష్ట పడింది. చేతిలో రూపాయి కూడా లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ ప్రజెంట్ ఆస్తుల విలువ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రజెంట్ నయనతార ఆస్తుల విల 254 కోట్లుగా తెలుస్తుంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతటి పోజీషన్ లోకి రావడం మాటలు కాదు. అయితే, రీసెంట్ గా తాను ప్రేమించిన కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ని పెళ్లి చేసుకున్న నయన్..ప్రజెంట్ హనీ మూన్ లో చాలా బిజీ గా గడుపుతుంది.

అయితే, నయన్ తన ఆస్తులు మొత్తం విగ్నేశ్ పేరుమీద కి మార్చేసిందట. కోలీవుడ్ లో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అతని పేరిట రాయడం..అభిమానులకు నచ్చలేదు. ఈరోజుల్లో పెళ్లి బంధం అనేది ఓ గేమ్ లా అయిపోయింది..ఎప్పుడు కలిసి ఉంటారో ఎప్పుడు విడిపోతారో ఎవ్వరు ఊహించలేకపోతున్నారు. అలాంటిది నయన్ తన ఆస్తులను విగ్నేశ్ శివన్ పేరు పై మార్చారు అని న్యూస్ వైరల్ కావడం సంచలనంగా మారింది. నయన్ తెలిసి తెలిసి ఇంత పెద్ద తప్పు ఎలా చేశారు అంటూ..అభిమానులు మండిపడుతున్నారు. ఏది ఏమైన నయన్ విగ్నేశ్ మాయలో కొంప ముంచేసుకుంటుంది..అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.