కాళ్ళు విరిగినా, వెన్ను విరిగినా వాళ్ళ కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టేస్తాడట!

తాత నందమూరి తారకరామారావు పేరు పెట్టుకున్న జూనియర్ తారకరామారావు నటనలో విశ్వరూపం చూపిస్తారు. నాట్యంలో నటరాజులా మారిపోతారు. ఒక్కమాటలో చెప్పాలంటే తారక్ డాన్సుల కోసం అభిమాలులు ఎంతగా పడిచస్తారో వారిని మెప్పించడానికీ తారక్ అంతే ప్రాణం పెట్టేస్తారు. 13 ఏళ్ళు కూచిపూడి నేర్చుకున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఆ అనుభవాన్ని తన ప్రతీ సినిమాలో చూపిస్తున్నారు. డాన్స్ అంటే మెగా హీరోలదే..కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొని మరీ అభిమానులను అలరిస్తారు.. అని అందరూ చెప్పుకున్నారు.

అయితే, దాన్ని తారక్ తప్పు అని ప్రూవ్ చేసిన సందర్భాలు, పాటలు చాలా ఉన్నాయి. నిన్ను చూడాలని, స్టూడెంట్ నంబర్ 1 నుంచి సింహాద్రి, సాంబ, ఆంధ్రావాలా, రాఖీ, అశోక్, నరసింహుడు, లాంటి సినిమాల వరకు తారక్ బొద్ధుగా కనిపించారు. అయినా అంత భారీ పర్సనాలిటీతో కూడా సిల్వర్ స్క్రీన్ మీద డాన్సులు చేస్తుంటే స్క్రీన్ ముందు అభిమానులు ఆయన స్టెప్పులు ఇమిటేట్ చేస్తూ అదరగొట్టిన పాటలెన్నో ఉన్నాయి. పాట వస్తే వస్తే స్క్రీన్ ముందుకు చేరిపోతారు నందమూరి అభిమానులు. అంతగా ఆయన డాన్సులకు పడిచస్తారు.

అయితే, స్వతాహాగా డాన్స్ అంటే తారక్‌కు చాలా ఇష్టం, ప్రాణం. అందుకే తన ప్రతీ సినిమాలో మాస్ సాంగ్..అదిరిపోయే స్టెప్పులు ఉండేలా దర్శకులు, సంగీత దర్శకులు ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి సలాహా మేరకు స్లింగా యమదొంగ సినిమాలో కనిపించి అందరికీ షాకిచ్చారు. ఈ సినిమాలో తారక్ కనిపించిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందులో నాచోరే నాచోరే పాటను ప్రేమ్ రక్షిత డాన్స్ కొరియోగ్రఫీ చేశాడు. క్లిష్టమైన ఫ్లోర్ మోవ్‌మెంట్ చేస్తున్న సమయంలో కాలు విరిగింది కూడా. కొన్నాళ్ళు రెస్ట్ తీసుకున్న తారక్ ఆ మూవ్‌మెంట్ కాకుండా వేరేది కంపోజ్ చేద్దామని మాస్టర్ చెప్పినా కాంప్రమైజ్ కాలేదు. అంత పట్టుదల ఉంటుంది. ఇక అదుర్స్ సినిమాకు ముందు పెద్ద యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. వెన్నుముక బాగా దెబ్బతిన్నది. అప్పట్లో అందరూ చేసిన కామెంట్స్ ఇక లైఫ్‌లో తారక్ డాన్స్ చేయలేడని. కానీ, అదుర్స్ సినిమాలో డాన్సులు చేసి అందరి నోర్లూ మూయించారు. ఇక ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్‌కు చరణ్ కంటే కాస్త ఎక్కువ పేరు తారక్‌కే రావడం గొప్ప విషయం అని చెప్పాలి

Share post:

Popular