ప‌వ‌న్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన సినిమా ఏదో తెలుసా…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలుగు చిత్రసీమలో తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ఇక ఈయన సినిమా విడుదల అవుతుందంటే చాలు థియేటర్ల వద్ద రెండు మూడు రోజుల నుంచే పవన్ అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా ఉండదు అని చెప్పవచ్చు. మొదటిసారి దర్శకుడు అవుదామనుకున్న పవన్ కళ్యాణ్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమయ్యారు.

ఇకపోతే అందరి కోరిక మేరకు హీరోగా అడుగు పెట్టినప్పటికీ పవన్ కళ్యాణ్ దృష్టి మొత్తం దర్శకత్వం వైపు ఉండేది. నిజానికి దర్శకుడు కావాల్సిన పవన్ కళ్యాణ్ తన వదిన సురేఖ పట్టుదల కారణంగా హీరోగా మారాడు. ఇక వదిన కోరిక మేరకు హీరోగా మారినా.. దర్శకత్వం వైపు ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచేవారు పవన్ కళ్యాణ్. తన ప్రతి సినిమాలో కూడా తన మార్కు కనపడడం కోసం డైరెక్టర్లకు అక్కడక్కడ సలహా ఇస్తూ ఉంటాడు.

అలా బద్రి , తమ్ముడు, ఖుషి , గబ్బర్ సింగ్ లాంటి సినిమాలకు పరోక్షంగా దర్శకత్వం వహించాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నేరుగా దర్శకత్వం వహించిన జానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడంతో ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ డైరెక్టర్ గా మరో కొత్త ప్రయోగం చేయలేదు. ఇక ఈ సినిమా తర్వాత గుడుంబా శంకర్ సినిమా కి పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లే అందించగా ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.

దర్శకత్వం విభాగంలో ప్రత్యేకంగా ఒక కోర్సు కూడా నేర్చుకున్న పవన్ కళ్యాణ్ మొదటి సారి తన అన్న నటించిన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.. నాగబాబు నిర్మాతగా కె.బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన రుద్రవీణ సినిమాకు చిరంజీవి రికమండేషన్ తో పవన్ కళ్యాణ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఇక ఇది ఒక మంచి క్లాసిక్ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.