బాల‌న‌టుడిగా రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన సినిమా ఏదో తెలుసా…!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా తో పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇండస్ట్రీలోకి చిరంజీవి వారసుడిగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో చిరుత సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ఇక మొదటి సినిమాతోనే స్టార్ హీరో గా మారిన రామ్ చరణ్ తన రెండవ సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశారు అని చెప్పవచ్చు.

మగధీర సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆ తరువాత వెనుతిరిగి చూడలేదు అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత మాస్ సినిమాలను చేస్తూ ఓపెనింగ్ రికార్డు దగ్గర నుండి ఫుల్ రన్ రికార్డ్స్ వరకు రికార్డ్ ల మీద రికార్డ్ లు సృష్టిస్తూ తండ్రికి తగ్గ తనయుడు గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన రంగస్థలం సినిమా తో మరో రికార్డును కూడా సృష్టించారు.

ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటాడు అని ప్రతి ఒక్కరు గట్టిగా నమ్ముతున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటన చూసి టాలీవుడ్ యువతులు కూడా ఆయనతో డేటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇక ఆయన పర్ఫామెన్స్ ఎంతలా వారిని ఆకట్టుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇదిలా ఉండగా రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు అనే విషయం చాలా మందికి తెలియదు అనే చెప్పాలి. ఆయన కూడా ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. చిరంజీవి 100 వ సినిమాగా దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో లంకేశ్వరుడు సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చిరంజీవి పక్కన ఒక సన్నివేశంలో ఒక అబ్బాయిని తీసుకోవాలి.

ఆ టైంలో ఎవర్నీ తీసుకోవాలని దర్శకుడు ఆలోచనలో ఉండగా.. సరదాగా మా అబ్బాయి చరణ్ అయితే ఎలా ఉంటుంది అని అడిగారట చిరంజీవి . అద్భుతమైన ఆలోచన అని దాసరి నారాయణరావు ఆ సీన్ లో రామ్ చరణ్ ని తీసుకున్నారు. ఫైనల్ అవుట్ పుట్ చూస్తున్న సమయంలో ఆ సన్నివేశం ఎందుకో సీన్స్ కి సిన్ అవుతున్నట్లు అనిపించలేదట. ఇక దీంతో రామ్ చరణ్ మీద తీసిన ఆ సన్నివేశాన్ని ఎడిటింగ్లో తొలగించేశారు

Share post:

Popular