ఒక‌ప్ప‌టి హీరోయిన్ ‘ సంఘ‌వి ‘ ఆ డైరెక్ట‌ర్‌ను పెళ్లాడి విడిపోవ‌డానికి కార‌ణం ఇదే…!

హీరో, హీరోయిన్లు, డైరెక్టర్లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు కలిసి ఉంటారో కూడా తెలియదు. కొద్దిరోజులు కలిసిన తర్వాత సినీ సెలబ్రెటీలు తమ బంధానికి ముగింపు పలుకుతూ విడిపోతూ ఉంటారు. దీనికి కారణాలు ఉంటాయి. విబేధాలు కారణంగా కొంతమంది విడిపోపతే.. టైమ్ లేకపోవడం వల్ల సరిగ్గా మాట్లాడుకోకపోవడం మరోక కారణం.

షూటింగ్ లతో బిజీగా ఉండే సినీ సెలబ్రెటీలకు మాట్లాడే అవకాశం తక్కువగా ఉంటుంది. దీంతో ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరినొకరు మాట్లాడుకుని అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించుకోవడానికి టైమ్ ఉండదు. దీంతో సినీ సెలబ్రెటీలు విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే రెండు, మూడు పెళ్లిళ్లు కూడా చేసుకుంటూ ఉంటారు.

అలాగే ఈ బాటలోనే ఒక హీరోయిన్ ఓ స్టార్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుని కొద్దిరోజులకే విడిపోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు సంఘవి. తాజ్ మహల్ సినిమా తర్వాత తెలుగు సినిమాకు పరిచయమైన సంఘవి..వెంకటేష్ హీరోగా వచ్చిన సూర్యవంశం సినిమాతో గుర్తింపు పొందింది. దాదాపు 23 సంత్సరాలపాటు హీరోయిన్ గా కొనసాగిన సంఘవి.. తెలుగులో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

1998లో శివయ్య సినిమాలో నటించేటప్పుడు స్టార్ డైరెక్టర్ సురేష్ శర్మను సంఘవి ప్రేమ పెళ్లి చేసుకుంది. అయితే వీరి పెళ్లిబంధం ఎన్నో రోజులు నిలువలేదు. విబేధాల కారణంగా డైరక్టర్ సురేష్ వర్మతో సంఘవి విడిపోయింది. ఆ తర్వాత బెంగళూరుకి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని సంఘవి పెళ్లి చేసుకుంది. ఇటీవలే 42 సంవత్సరాల వయస్సులో ఓ ఆడబిడ్డకు సంఘవి జన్మనిచ్చింది.