కమల్‌తో చిన్న‌ప్పుడే న‌టించిన బ‌న్నీ… ఆ సినిమా చూశారా…!

తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకడిగా అల్లు అర్జున్ కొనసాగుతున్నాడు. అల్లు అర్జున్ కు తెలుగులో అభిమానులు చాలామందే ఉన్నారు. స్ట్రైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న బన్నీ.. తన డ్యాన్స్, తన మార్క్ స్ట్రైల్ తో అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాడు. టాలీవుడ్ తో పాటు కేరళలో కూడా అల్లు అర్జున్ కి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గంగోత్రి సినిమా చూసి అసలు ఇతడు హీరో ఎలా అవుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత తన స్ట్రైల్ ను మార్చుకుని ఈ రోజు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్థాయికి చేరిపోయాడు. తెలుగు పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పుష్ప రిలీజ్ అవ్వగా.. భారీగా కలెక్షన్లు సంపాదించుకున్నాయి. ఈ సినిమాలోని సాంగ్స్ కూడా మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. ఇక పుష్ప 2 కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన బన్నీ.. చిన్నతనంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు. ఏయే సినిమాల్లో నటించాడో ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి నటించిన చాలా సినిమాల్లో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా శచ్చిన ఒక సినిమాలో కూడా అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అయితే ఈ విషయం మనలో చాలామందికి అసలు తెలియదు. స్వాతిముత్యం సినిమా స్టార్టింగ్ లో కమల్ హాసన్ తాత పాత్రలో కనిపిస్తారు. ఇందులో కమల్ హాసన్ మనవడిగా అల్లు అర్జున్ నటించాడు.

ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతుకున్న సమయంలో అల్లు అర్జున్ షూటింగ్ స్పాట్ కు వచ్చాడట. దీంతో మనవడి పాత్ర కోసం అల్లు అర్జున్ అనుకుంటున్నామని అల్లు అరవింద్ ని దర్శకుడు విశ్వనాథ్ అడిగారట. దీనికి అల్లు అరవింద్ ఓకే చెప్పడంతో.. ఆ పాత్ర కోసం రెండు రోజులు పాటు అల్లు అర్జున్ షూటింగ్ లో పాల్గొన్నాడు.

Share post:

Latest