“నీ బిల్లు నువ్వే కట్టుకో ..పో”..పూజా కి బిగ్ షాకిచ్చిన ఆ నిర్మాణ సంస్ధ..?

యస్..తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్తనే నిజం అని తెలుస్తుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కు ఎంత పేరు ఉందో. కెరీర్ మొదట్లో ఒక్క హిట్ కోసం నానా తంటాలు పడినా..ఆ తరువాత మెల్లగా మెల్ల మెల్లగా హిట్ ట్రాక్ లోకి వచ్చి..టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లింది. అంతేనా, ఇప్పుడు పూజా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్..మూడు భాషల్లోను సినిమాలు చేస్తూ బిజీయస్ట్ హీరోయిన్ గా మారిపోయింది.

ఆశ్చర్యం ఏమిటంటే..అమ్మడు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద ఫ్లాప్ అవుతున్నా కానీ, పూజా హెగ్డే క్రేజ్ మాత్రం తగ్గలేదు..అంతలా ఓ రేంజ్ లో సినిమాలకు సైన్ చేస్తూ..దూసుకుపోతుంది. అయితే, రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డేకు ఓ నిర్మాణ సంస్ధ భారీ షాకిచ్చిన్నట్లు తెలుస్తుంది. పూజా హెగ్డే, విజయ్ హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం..”బీస్ట్”. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోగా..అవి కాస్త నిరాశ పరిచాయి. బీస్ట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

ఒక్క అరబిక్ కుతు పాట తప్పిస్తే సినిమాలో పెద్దగా హైలెట్ అయ్యే పాయింట్స్ ఏం లేవు అన్న టాక్ బయటకి వచ్చింది. అయితే, ఈ సినిమాకి పూజా భారీ స్ధాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు..అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. కాగా, ఇప్పుడు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది. బీస్ట్ సినిమా టైంలో పూజా హద్దులు దాటి ఖర్చు చేసిందని..కేవలం..ఫుడ్ కోసమే..పూజా తన స్నేహితులతో కలిసి లక్షల్లో ఖర్చు చేసిందని..మొదలే సినిమా నష్టాల్లో మునిగి పోయుంటే..ఇలాంటి బిల్లులు నిర్మాతకి చిరెత్తించింది. దీంతో కోపంతో ఊగిపోయి..బీస్ట్ సినిమా నిర్మాతలు..పూజా ఖర్చు చేసిన అదనపు బిల్లులు అన్ని ఆమె చెల్లించుకోవాలని ..నోటీసులు పంపించారట. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. అయితే, దీని పై అటు పూజా కానీ, ఇటు బీస్ట్ నిర్మాతలు కానీ ఏ విధంగా రెస్పాండ్ అవ్వలేదు. ఏది ఏమైనా పూజా లాంటి బిగ్ స్టార్ పై ఇలాంటి వార్త ఇండస్ట్రీలో కొట్ట టెన్షన్ పుట్టిస్తుంది.

Share post:

Popular