బ్రేకింగ్: నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటీవ్..అభిమానుల్లో టెన్షన్..!!

మాయదారి కరోనా మహమ్మారి మళ్ళీ మానవాళి పై కొర్రలు చాస్తూ..విజృంభిస్తుంది. మొన్నటి వరకు కరోనా మూడో వేవ్ అంటూ మనల్ని ముప్పుతిప్పలు పెట్టినా..ఈ మధ్యనే కాస్త తగ్గు ముఖం పట్టడంతో మళ్ళీ అందరు బయటకి వచ్చి తమ పనులు చేసుకుంటూ..పాత రోజుల్లోకి వెళ్ళారు. అయితే, తాజాగా మళ్ళీ కరోనా నాలుగో వేవ్ వచ్చిందంటూ ప్రచారం జరుగుతుంది.

- Advertisement -

పలు ఆరోగ్య సంస్దలు కూడా..బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరి అని చెప్పుతూ వస్తున్నాయి. అయితే, ఈ కరోనా మహామారి మళ్ళీ సినీ ఇండస్ట్రీ వైపు మళ్ళీంది. కరోనా ఫస్ట్, సెకండ్, ధర్డ్ వేవ్ లో చాలా మంది సినీ ప్రముఖులు..ఈ కరోనా మహమ్మారి భారిన పడగ..తాజాగా..మన టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ కరోనా పాజిటీవ్ గా నిర్ధారించబడ్డారు.

స్వల్ప కరోనా లక్ష్ణాలు కనిపించడంతో..టెస్ట్ చేయించుకున్న బాలయ్యకు కొద్దిసేపటి క్రితమే కరోనా పాజిటీవ్ గా తేలింది. దీంతో నందమూరి అభిమానుల్లో టేన్షన్ నెలకొంది. అయితే, బాలయ్య తనకు కరోనా అని తెలియగానే హోమ్ ఐసోలేషన్ కు వెళ్లిపోయారని..ఆయన ఆరోగ్యం బాగుందని..భయపడాల్సిన అవసరం లేదు అని..సన్నిహితులు చెప్పుకొచ్చారు. తనను కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకుని..తగిన జాగ్రత్తలు తీసుకోమని బాలయ్య చెప్పుకొచ్చారు. బాలయ్యకు కరోనా అని తెలియగానే..అభిమానులు పూజలు చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని..కోరుకుంటున్నారు.

Share post:

Popular